Onions: ఉల్లి ధరలు మరింత కన్నీరు తెప్పించకుండా.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఈ నిర్ణయం నేటి నుంచి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ..

Onion
Onions – Exports: దేశంలో ఉల్లి రేట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కేంద్ర సర్కారు బఫర్ స్టాక్ (buffer stock) నుంచి ఉల్లిపాయలను పంపిణీ చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం నేటి నుంచి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెలలో ఉల్లి ధరలూ పెరుగుతూ వస్తున్నాయి. సెప్టెబంరులోనూ ఇదే విధంగా ఉల్లి ధరలు పెరుగుతాయని పలు నివేదికలు స్పష్టం చేశాయి.
దీంతో దేశంలో కావాల్సినంత ఉల్లి నిల్వలు ఉండడానికి, ధరలు మరింత పెరగకుండా ఉండడానికి కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ నెలలో ఇప్పటివరకు టమాటా ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. టమాటాలతో పాటు ఉల్లి, ఆలుగడ్డ ధరలూ అదే రీతిలో పెరుగుతున్నాయని ఓ నివేదిక ద్వారా స్పష్టమైంది. 2023-24 ఏడాదికిగానూ మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి బఫర్ స్టాక్ ను కేంద్ర సర్కారు గోదాముల్లో భద్రపరిచింది.
దేశంలోని ఏయే ప్రాంతాల్లో రేట్లు పెరుగుతున్నాయో ఆ ప్రాంతాలకు ఉల్లి సరఫరా జరుగుతోంది. భారత్ లో గతంలో ఉల్లి ధరలు అమాంతం పెరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కారు అప్రమత్తంగా ఉంటోంది.
Supreme Court: క్షమాపణ చెప్పి తప్పించుకోలేరు.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సుప్రీం సీరియస్