Instamart QIM Sale Offers : ఇన్‌స్టామార్ట్ క్విక్ ఇండియా మూమెంట్ సేల్.. టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు.. జస్ట్ 10 నిమిషాల్లోనే హోం డెలివరీ..!
Instamart QIM Sale Offers : ఇన్‌స్టామార్ట్ క్విక్ ఇండియా మూవ్‌మెంట్ సేల్ సందర్భంగా టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

Instamart Quick India Movement Sale
Instamart Quick India Movement Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాదు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా పండగ సేల్ ఆఫర్లను ప్రకటించింది. రెస్టారెంట్ ఫుడ్‌తో పాటు క్విక్ డెలివరీ సర్వీసుల్లో ఒకటైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ‘ఇన్‌స్టామార్ట్స్ క్విక్ ఇండియా మూవ్‌మెంట్ (QIM) సేల్ ప్రారంభించింది.
ఈ పండుగ సీజన్ కొత్త సేల్‌లో అనేక పాపులర్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందిస్తోంది. కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది. ఈ సేల్ ఆఫర్లు సెప్టెంబర్ 28 (2025) వరకు కొనసాగుతుంది. రోజువారీ గోల్డెన్ అవర్ డిస్కౌంట్‌లతో పాటు ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు. బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వరకు ఈ ప్లాట్‌ఫామ్ నుంచి కొనుగోలు చేయగల టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇప్పుడు చూద్దాం..
ఇన్‌స్టామార్ట్ క్విక్ ఇండియా మూవ్‌మెంట్ సేల్.. 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌లు డెలివరీ
1. రెడ్‌మి 13 ధర రూ. 10,999 :
ఈ స్మార్ట్‌ఫోన్ 108MP రియర్ కెమెరాతో వస్తుంది. 5030mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు తగినంత స్టోరేజ్‌తో వస్తుంది. పండుగ సెల్ఫీలు, వీడియోలకు సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
2. పోకో C71 ధర రూ. 6,299 :
ఈ పోకో ఫోన్ 32MP రియర్ షూటర్, 5200mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. విద్యార్థులు, సాధారణ యూజర్లకు పోకో C71 మల్టీ టాస్కింగ్ ఆప్షన్ అందిస్తుంది. సోషల్ మీడియా, గేమింగ్, వీడియోలకు అద్భుతంగా ఉంటుంది.
3. రియల్‌మి 14x ధర రూ. 12,999 :
ఈ రియల్‌మి 14x ఫోన్ 50MP రియర్ షూటర్‌తో వస్తుంది. 6,000mAh బ్యాటరీ సపోర్టు, 128GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలతో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఆధారిత ఫోన్ వినియోగదారులకు బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్, పండుగ వేడుకలకు అద్భుతమైన ఆప్షన్.
4. ఐఫోన్ 16e ధర రూ. 54,900 :
ఐఫోన్ 16e మోడల్ 48MP రియర్ కెమెరాతో వస్తుంది. 6.1-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను పండుగ సేల్ ఆఫర్లలో సరసమైన ధరకే ఆపిల్ ఫ్యాన్స్ కొనేసుకోవచ్చు. 48MP కెమెరా, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఈ iOS ఫోన్ పర్ఫార్మెన్స్, ప్రీమియం స్టయిల్ కోరుకునేవారికి బెస్ట ఆప్షన్.
5. రెడ్‌మి 14C ధర రూ. 8,999 :
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 50MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. 5160mAh బ్యాటరీతో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. లాంగ్ టైమ్ బ్యాటరీని కలిగి ఉంది. సరసమైన ధరలో స్టార్‌లైట్ బ్లూ ఫినిషింగ్‌తో ఈ రెడ్‌మి ఫోన్ డీల్ సొంతం చేసుకోండి.
గోల్డెన్ అవర్ డీల్స్, టైమ్‌లైన్‌లు :
కొనుగోలుదారులు ప్రతిరోజూ సాయంత్రం 5:00 నుంచి 7:00 గంటల వరకు ఇన్‌స్టామార్ట్ ‘గోల్డెన్ అవర్’ ఆఫర్‌లను చెక్ చేయాలి. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.