ప్రీ-ఆర్డర్ బుకింగ్ : ఆపిల్ iPhone 11 సిరీస్ ఫోన్లు ఇవే

  • Published By: sreehari ,Published On : September 3, 2019 / 09:56 AM IST
ప్రీ-ఆర్డర్ బుకింగ్ : ఆపిల్ iPhone 11 సిరీస్ ఫోన్లు ఇవే

Updated On : September 3, 2019 / 9:56 AM IST

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బిగ్ ఈవెంట్ కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 10న అధికారికంగా ఐఫోన్ 11 సిరీస్ మోడల్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఐకానిక్ స్టీవ్ జాబ్స్ థియేటర్ లో మెగా ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా లేటెస్ట్ హార్డ్ వేర్ పొర్ట్ పోలియోతో ఆపిల్ కొత్త సిరీస్ ఫోన్లను ప్రకటించనుంది. ఆపిల్ కనీసం మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది.

ఫ్రీ ఆర్డర్లు ఎప్పుడంటే? :
iPhone 11, iPhone 11 Pro, iPhone Pro Max. ఈ మూడు సరికొత్త ఐఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన వెంటనే ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది ఆపిల్ కొత్త ఫోన్లకు సంబంధించి లీకులు, రుమర్లు వచ్చినట్టుగానే ఈసారి కూడా ఆపిల్ కొత్త ఫోన్ల ఫీచర్లు లీక్ అయినట్టు రుమర్లు వస్తున్నాయి. సెప్టెంబర్ 13 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. 

ఆపిల్ కొత్త ఫోన్లలో ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ లీకేజీ ఫొటోలను పరిశీలిస్తే.. ప్రస్తుతం ఆపిల్ అందించే స్మార్ట్ ఫోన్లలో iPhone XR, iPhone XS, iPhone XS మోడల్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ సిరీస్ కంటే కొత్త 11 సిరీస్ ఫోన్లలో రియర్ కెమెరా మాడ్యూల్ కాస్త డిఫరెంట్‌గా ఉండనుంది. స్వ్కెయిర్ కెమెరా మాడ్యూల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇందులో ఎక్కువ కెమెరా సెన్సార్లు ఫిట్ అయ్యేలా డిజైన్ చేశారు. ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ప్రీ ఆర్డర్లు, ధరకు సంబంధించి వార్తలు వస్తున్నాయి.

1. సెప్టెంబర్ 10న కొత్త iPhone 11 సిరీస్ లాంచ్
* మూడు కొత్త మోడల్స్ లాంచ్ కానున్నాయి. సెప్టెంబర్ 20-21 నుంచి సేల్ ప్రారంభం
* XS/XS Max సక్సెసర్స్ బ్రాండ్ iPhone Proతో రానున్నాయి.
* Pro ఐఫోన్లలో థర్డ్ సెన్సార్.. అల్ట్రా వైడ్ యాంగిల్ ఫీచర్ ఫుల్ ఎట్రాక్టీవ్‌గా ఉంది
* మూడు ఫోన్ల స్ర్కీన్ సైజులు 5.8 అంగుళాలు, 6.1 అంగుళాలు, 6.5అంగుళాలు 
* రివల్ ట్రేడేషనల్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.
* తక్కువ కాంతిలో కూడా ఫొటోలు తీసుకోవచ్చు. 
* ఫొటోలు, వీడియోలకు రీటచ్, ఎఫెక్ట్స్, అల్టర్ కలర్లు, రీఫ్రేమ్, క్రాఫ్ వీడియో చేసుకోవచ్చు.
* కొత్త రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ సిస్టమ్ (iPhoneలపై Airpods ఛార్జింగ్) 
* XR సక్సెసర్ ఫీచర్ ద్వారా రెండో బ్యాక్ కెమెరాతో zoom చేసుకోవచ్చు.
* న్యూ మ్యాట్ ఫినిష్, షట్టర్ రిసిస్టెన్స్ టెక్నాలజీ (బ్యాక్)
* 3D టచ్ టెక్నాలజీ.. Haptic Touch (XRలో ఇదే టెక్నాలజీ)
* మల్టీ యాంగిల్ Face ID సెన్సార్
* వాటర్ రిసిస్టెన్స్ స్పెషల్ గ్యారెంటీ ఆప్షన్
* A13 Soc ప్రాసెసర్ చిప్.. 7nm+ పవర్ ఎఫిసియన్సీ, AMX లేదా matrix కో ప్రాసెసర్
* ట్రిపుల్ లెన్స్ రియర్ కెమెరా (dual lens ఐఫోన్ 11Rలో ఉంది)
 * USB-C పోర్ట్, ఆపిల్ పెన్సిల్ 
* మూడు స్టోరేజీ వేరియంట్లు 64GB, 256GB, 512GB
* 12MP ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 12MP రియర్ కెమెరాలు 
 * Wi-Fi 6 వైర్ లెస్ కనెక్టవిటీ 
* 128GB, 256GB, 512GB స్టోరేజీలు
* ​​​​​​ 4GB of RAM + 6GB of RAM 

2. iphone 11, Pro, Pro Max ప్రారంభ ధరలు ఇవే :

* iPhone 11 ఫోన్ ధర : 749 డాలర్లు (రూ.54వేలు)
* iPhone 11 Pro ధర : 999 డాలర్లు (రూ.72వేలు)
* iPhone 11 Pro Max ధర : 1,099 డాలర్లు (రూ.79వేలు)