iPhone 16e Price : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే.. ఇది కదా డీల్ అంటే..!

iPhone 16e Price : ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ ధర తగ్గిందోచ్.. సరసమైన ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో కొనేసుకోవచ్చు. ఇలాంటి డీల్ మళ్లీ దొరకదు..

iPhone 16e Price : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే.. ఇది కదా డీల్ అంటే..!

iPhone 16e Price

Updated On : June 24, 2025 / 12:03 PM IST

iPhone 16e Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 ప్రో మోడల్స్ లేదా ఐఫోన్ 16 లైనప్‌ ఏదైనా కొనేసుకోవచ్చు. అయితే, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో కొత్త ఐఫోన్  (iPhone 16e Price) కావాలంటే మాత్రం ఐఫోన్ 16e తీసుకోవాల్సిందే.. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం డిజైన్, యాక్షన్ బటన్, పవర్‌ఫుల్ A18 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో రూ. 9వేలు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.59,900 ధరకు లాంచ్ అయిన ఈ ఐఫోన్ 16e మోడల్ ఆపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్‌ ఐడీ, ఇతర ఫీచర్లతో అత్యంత సరసమైన వేరియంట్‌గా అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16e ధర :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16e రూ.54,900కి అందుబాటులో ఉంది. లాంచ్ ధరపై రూ.5వేలు తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. ధర రూ.50,900 కన్నా తగ్గుతుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఐఫోన్ కొత్త ఐఫోన్ 16e కోసం ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే.. ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్, వేరియంట్ ఆధారంగా రూ. 41,600 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.

Read Also : EV Plane : వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానం.. కేవలం రూ. 700కే 130 కి.మీ ప్రయాణం.. సింగిల్ ఛార్జ్‌తో 250 నాటికల్ మైళ్ల వరకు..!

ఆపిల్ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు (iPhone 16e Price) :
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 6.1-అంగుళాల OLED 460ppi సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 1200 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. HDR, ట్రూ టోన్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంది. ఈ ఐఫోన్ పవర్‌ఫుల్ A18 చిప్‌సెట్‌తో సపోర్టు ఇస్తుంది. iOS 18.4పై రన్ అవుతుంది. IP68-సర్టిఫైడ్ కూడా కలిగి ఉంది. ఈ ఐఫోన్ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ ఐఫోన్ OISతో 48MP వైడ్-యాంగిల్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్, 4K 60fps వద్ద డాల్బీ విజన్‌తో HDR వీడియో రికార్డింగ్ ఉన్నాయి. 30 fps వద్ద 4K HDR వరకు సపోర్టుతో సినిమాటిక్ మోడ్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. 60fps వద్ద 4K వరకు రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.