iQOO 13 Launch : వచ్చే వారమే ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు, ధర లీక్..!

iQOO 13 India Launch : ఈ ఐక్యూ 13 ఫోన్ బ్యాక్‌సైడ్ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ లైటింగ్‌తో సహా అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లతో కూడా వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని అంచనా.

iQOO 13 Launch : వచ్చే వారమే ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు, ధర లీక్..!

iQOO 13 India launch next week

Updated On : November 28, 2024 / 7:07 PM IST

iQOO 13 India Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐక్యూ బ్రాండ్ నుంచి ప్రధాన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ ఐక్యూ 13 వచ్చేస్తోంది. ప్రస్తుతం క్వాల్‌కామ్ ప్రధాన చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా ఈ కొత్త ఫోన్ పనిచేస్తుంది. ఈ ఐక్యూ 13 ఫోన్ బ్యాక్‌సైడ్ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ లైటింగ్‌తో సహా అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లతో కూడా వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని అంచనా. డిసెంబర్ 3 రిలీజ్ తేదీన లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఐక్యూ 13 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఐక్యూ 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 3ఎన్ఎమ్ ప్రాసెస్‌తో వస్తుంది. ఆపిల్ ఎ18 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 వంటి ఇతర ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌లతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆపిల్ ఎ18 ప్రో కన్నా మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని నివేదికలు సూచించాయి. ముఖ్యంగా, పర్ఫార్మెన్స్-కేంద్రీకృత గేమింగ్-సెంట్రిక్ ఉపయోగానికి ఐక్యూ 13 బ్రాండ్ క్యూ2 చిప్‌ను కలిగి ఉంటుంది.

మెమరీ విషయానికొస్తే.. చైనీస్ వేరియంట్ 12జీబీ లేదా 16జీబీ ర్యామ్‌‌తో వస్తుంది. భారత్ కూడా అదే ఆప్షన్లను స్వీకరించే అవకాశం ఉంది. చైనీస్ మోడల్ యూఎఫ్ఎస్ 4.1తో 1టీబీ వరకు స్టోరేజీని కూడా అందిస్తుంది. అయితే, ఈ స్టోరేజ్ ఆప్షన్ భారత్‌లో అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ 13 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని బ్రాండ్ ధృవీకరించింది. ఇందులో సోనీ ఐఎమ్ఎక్స్ 921 సెన్సార్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 4ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 60ఎఫ్‌పీఎస్ వద్ద 4కె వీడియోలను రికార్డ్ చేయగల 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీతో రావచ్చు. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంటెన్సివ్ టాస్క్‌ల సమయంలో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి డివైజ్ స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఐక్యూ 13 నీరు, ధూళి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌తో వస్తుంది. చివరకు డిస్‌ప్లే డివైజ్ 144Hz సపోర్టుతో 6.82-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ ప్యానెల్‌ను అందిస్తుంది.

ఐక్యూ 13 ధర (అంచనా) :
డిసెంబర్ 3న లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఐక్యూ 13 అధికారిక ధర వెల్లడి కానుంది. అయితే, అమెజాన్, కంపెనీ సొంత వెబ్‌సైట్‌లో ఫోన్ దాదాపు రూ. 50వేల లోపు ధరలో ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. కాంటెక్స్ కోసం ఐక్యూ 12 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 52,999 వద్ద ప్రారంభమైంది. అయితే, 16జీబీ ర్యామ్, 512జీబీ మోడల్ ధర రూ. 57,999కు పొందవచ్చు. ఐక్యూ 13 ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

Read Also : iPhone 17 Pro Models : స్పెషల్ కెమెరా ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్స్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?