Jet Airways : బ్యాంకు మోసం కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్ట్
కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు....

Jet Airways founder Naresh Goyal
Jet Airways : కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. (arrested) అరెస్టుకు ముందు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. (Jet Airways founder Naresh Goyal) మే 5వతేదీన గోయల్ నివాసం, కార్యాలయాలు సహా ముంబయిలోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
Heavy Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
గోయల్‌ను విచారణ కోసం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కి తరలించారు. (Rs 538 crore bank fraud case) ఈ ఏడాది మేలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైంది. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని గత ఏడాది నవంబర్ 11వతేదీన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. జెట్ ఎయిర్‌వేస్ 25 సంవత్సరాల పాటు విమానాలు నడిపిన తర్వాత ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను మూసివేసింది.