Jimmy Tata : రతన్ టాటా తమ్ముడు జిమ్మీ టాటా ఈయనే.. 2bhkలో సాధారణ జీవితం గడుపుతూ.. మొబైల్ కూడా లేదట..!

ఎంతో అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయనే జిమ్మీ టాటా.. రతన్ టాటాకు స్వయానా తమ్ముడు.. ఈయన అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతుండటం విశేషం.

Jimmy Tata : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా జీవించినంతకాలం ఎందరికో ఆదర్శం, స్ఫూర్తిదాయకంగా జీవించారు. అదే విలువలతో ఆయన తుది శ్వాస విడిచే వరకూ కొనసాగించారు. వయస్సు ప్రభావ సమస్యలతో ఆస్పత్రిలో చేరినా రతన్ టాటా చివరికి తుది శ్వాస విడిచారు. తన సోదరుడు రతన్ మరణవార్త తెలిసిన వెంటనే జిమ్మీ వీల్ చైర్‌లో వెళ్లి నివాళులు అర్పించారు. అయితే, విలాసవంతమైన జీవితం కన్నా విలువలతో కూడిన జీవితమే ఎంతో ముఖ్యమని భావించినా రతన్ టాటాకు సోదరుడు కూడా ఉన్నాడు.

Read Also : పెంపుడు కుక్కల కారణంగా బ్రిటన్‌ రాజు చార్లెస్‌ నుంచి అవార్డు అందుకోలేక పోయిన రతన్ టాటా..

ఆయన కూడా ఎంతో అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయనే జిమ్మీ టాటా.. రతన్ టాటాకు స్వయానా తమ్ముడు.. ఒకవైపు రతన్ టాటా తన జీవితాన్ని వ్యాపారాలు, దాతృత్వాలతోనే గడపగా.. సోదరుడు జిమ్మీ మాత్రం అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతుండటం విశేషం.

2bhk ప్లాట్‌లో సాధారణ జీవితం :
ప్రస్తుతం ఆయన ముంబైలో కొలాబాలో నివాస ముంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉంటూ నిరాండబర జీవితాన్ని గడిపేస్తున్నారు. రతన్ టాటాకు సోదరుడైన జిమ్మీకి మొదటినుంచి వ్యాపారంపై ఆసక్తి లేదు. కనీసం ఆయన మొబైల్ ఫోన్ కూడా వాడరంటే అతిశయోక్తి కాదు. టెక్ గాడ్జెట్లను దగ్గరకు కూడా రానివ్వరు. కేవలం పుస్తకాలు, న్యూస్ పేపర్లు మాత్రమే చదివేందుకు బాగా ఇష్టపడతారు ఆయన. ఒక్క మాటలో చెప్పారంటే జిమ్మి టాటా ఇళ్లు విడిచి బయటకు వెళ్లరనే చెప్పాలి.

జిమ్మీ టాటాను జిమ్మీ నావల్ టాటా కూడా పిలుస్తారు. రతన్ టాటాకు తమ్ముడు కావడంతో ఆయనకు టాటా గ్రూప్‌లో పెద్ద వాటానే ఉంది. అయినప్పటికీ కూడా జిమ్మీ టాటా కుటుంబ వ్యాపారంపై ఆసక్తిని కనపర్చలేదు. విలాసవంతమైన జీవితానికి దూరంగా మధ్యతరగతి సామాన్యుడిలా తన జీవితాన్ని గడుపుతున్నారు.

జిమ్మీతో రతన్ అనుబంధం :
మరో మాటలో చెప్పాలంటే.. ఆయనకు డబ్బు, విలాసాలపై రవ్వంత కూడా ఆసక్తి లేదు. ఇటీవలే జిమ్మీ టాటా పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో కలిసి ఫొటో కూడా దిగారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అప్పుడే రతన్ టాటాకు తమ్ముడు కూడా ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది. ఈ పోస్టుకు రతన్ టాటా క్యాప్షన్ సైతం పెట్టారు. “అవి సంతోషకరమైన రోజులు. మా మధ్య ఎలాంటివి ఉండవు. 1945లో నా సోదరుడు జిమ్మీతో..” ఈ పోస్టు కూడా వైరల్ అయింది.

జిమ్మీ టాటా నికర విలువ :
2024 నాటికి, జిమ్మీ టాటా నికర విలువ టాటా కంపెనీలలో గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జిమ్మీ నికర ఆదాయం విలువ దాదాపు రూ.3800 కోట్లు పైమాటే. 2022 నవంబర్ నెలలో జిమ్మీ, రతన్ టాటాల ఉమ్మడి విలువ రూ. 23,874 కోట్లు (2.99 ​​బిలియన్ డాలర్లు)గా అంచనా. వ్యాపార ప్రపంచంలో రతన్ టాటా మాత్రమే కనిపించగా.. టాటా ప్రధాన సంస్థలలో జిమ్మీ వాటాల యాజమాన్యం ఆయన సంపద గణనీయంగా పెంచింది. అంతేకాదు.. సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీగా కూడా జిమ్మీ టాటా పనిచేస్తున్నారు. 1989లో వారి తండ్రి నావల్ టాటా మరణించిన తర్వాత ఇది ఆయనకు సంక్రమించింది.

Read Also : Ratan Tata – Amitabh Bachchan : అన్నిట్లో సక్సెస్ అయిన రతన్ టాటా.. సినిమాల్లో మాత్రం.. అమితాబ్‌తో సినిమా తీసి..