పెంపుడు కుక్కల కారణంగా బ్రిటన్‌ రాజు చార్లెస్‌ నుంచి అవార్డు అందుకోలేక పోయిన రతన్ టాటా..

రతన్ టాటా జంతు ప్రేమికుడు. ఆయనకు కుక్కలంటే ఎనలేని మక్కువ. తన వద్ద పెంపుడు కుక్కల కారణంగా

పెంపుడు కుక్కల కారణంగా బ్రిటన్‌ రాజు చార్లెస్‌ నుంచి అవార్డు అందుకోలేక పోయిన రతన్ టాటా..

Ratan Tata passes away

Updated On : October 10, 2024 / 2:30 PM IST

Ratan Tata : భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ఆయన టాటా గ్రూప్స్ కు అపూర్వ విజయాలను అందించారు. అదే సమయంలో దాతృత్వానికి పర్యాయపదంగా మారారు. రతన్ టాటా సేవలకుగాను జీవితకాల సౌఫల్య పురస్కారాన్ని ఇవాలని బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్3 నిర్ణయించారు. బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్ తో కలిసి ఈ అవార్డు వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. 2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ రాజభవనమైన బకింగ్ హొమ్ ప్యాలెస్ లో కార్యక్రమం నిర్వహించారు. అయితే, రతన్ టాటా మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనికి కారణం అతని పెంపుడు కుక్కలు.

Also Read: శంతను నాయుడు ఎవరు.. రతన్ టాటాతో అతనికున్న బంధం ఏమిటి.. వారిని కలిపింది ఎవరో తెలుసా?

రతన్ టాటా జంతు ప్రేమికుడు. ఆయనకు కుక్కలంటే ఎనలేని మక్కువ. తన వద్ద పెంపుడు కుక్కల కారణంగా రతన్ టాటా బ్రిటన్ రాజు చార్లెస్3 నుంచి అవార్డును అందుకోలేక పోయారు. రతన్ టాటా వద్ద పెంపుడు కుక్కలు టాంగో, టిటో అనారోగ్యానికి గురయ్యాయి. సరిగ్గా అవార్డుల కార్యక్రమానికి వెళ్లాల్సిన సమయంలో కుక్కలు అనారోగ్యానికి గురికావటంతో రతన్ టాటా వాటిని చూసుకునేందుకు ఉండిపోయాడు. అవార్డుల కార్యక్రమానికి రాలేనని చెప్పేశాడు. ఈ విషయాన్ని పారిశ్రామిక వేత్త సుహైల్ సేథ్ కొద్దిరోజుల కిందట ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో గుర్తు చేసుకున్నారు. ప్రిన్స్ ఛార్లెస్ పేరు చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించినా రతన్ టాటా ఒప్పుకోలేదని చెప్పాడు.

 

బ్రిటన్ ప్రిన్స్ ఛార్లెస్ కు రతన్ టాటా కార్యక్రమానికి హాజరు కావటం లేదని, ఎందుకు హాజరు కావటం లేదో వివరించడం జరిగిందని.. దీంతో రతన్ టాటాను అతను అభినందించినట్లు సుహెల్ సేథ్ చెప్పారు. మనిషి ఇలాగే ఉండాలి.. రతన్ టాటా అద్భుతమైన వ్యక్తి. ఆయన ఈ స్థితిలో ఉండటానికి కారణం ఇదే అని ప్రిన్స్ ఛార్లెస్ అభినందించారని సెహైల్ చెప్పుకొచ్చారు.