రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా? అయితే ఈ 5 వివరాలు తెలుసుకోవాల్సిందే..

ఈ బైకులో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రూవెన్ 349cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ J-సిరీస్ ఇంజిన్‌ను అమర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా? అయితే ఈ 5 వివరాలు తెలుసుకోవాల్సిందే..

Updated On : August 4, 2025 / 8:36 PM IST

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రెట్రో బైక్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, 2025 మోడల్‌గా సరికొత్త హంగులతో మార్కెట్లోకి ఉంది. ఈ సారి కొన్ని కీలకమైన ఫీచర్ల అప్‌డేట్లతో రైడర్లను ఆకట్టుకుంటోంది. దీని ధర, ఫీచర్లు, ఇంజిన్ వివరాలను ఇప్పుడు చూద్దాం..

2025 క్లాసిక్ 350 ఎక్స్‌షోరూమ్ ధరలు

  • జోధ్‌పూర్ బ్లూ: రూ.2.03 లక్షలు
  • మద్రాస్ రెడ్: రూ.2.03 లక్షలు
  • మెడాలియన్ బ్రొన్జ్: రూ.2.08 లక్షలు
  • కమాండో శాండ్: రూ.2.20 లక్షలు
  • గన్ గ్రే: రూ.2.29 లక్షలు
  • స్టెల్త్ బ్లాక్: రూ.2.29 లక్షలు
  • ఎమరాల్డ్ గ్రీన్: రూ.2.34 లక్షలు

ఇంజిన్ పనితీరు
ఈ బైకులో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రూవెన్ 349cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ J-సిరీస్ ఇంజిన్‌ను అమర్చారు.

  • ఇంజిన్ కెపాసిటీ: 349 cc
  • గరిష్ఠ పవర్: 20.2 HP
  • గరిష్ఠ టార్క్: 27 Nm
  • గేర్‌బాక్స్: 5-స్పీడ్
  • స్టార్టింగ్: ఎలక్ట్రిక్ స్టార్ట్

Also Read: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌కు క్యాబినెట్ ఆమోదం.. ఇక అసెంబ్లీలో రిపోర్టుపై చర్చ.. ఆ తర్వాత నిర్ణయం: రేవంత్ రెడ్డి

సస్పెన్షన్, బ్రేక్స్, మైలేజ్
ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్‌తో నిర్మించిన ఈ బైక్, సౌకర్యవంతమైన రైడ్, మంచి బ్రేకింగ్ వ్యవస్థతో వచ్చింది.

  • ఫ్రంట్ సస్పెన్షన్: 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్
  • రియర్ సస్పెన్షన్: 6-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్
  • ఫ్రంట్ బ్రేక్: 300mm డిస్క్
  • రియర్ బ్రేక్: 270mm డిస్క్
  • ABS: డ్యూయల్-ఛానల్ ABS (స్టాండర్డ్)
  • మైలేజ్ (కంపెనీ ప్రకారం): 41.55 కి.మీ/లీ

డిజైన్

  • సీటు ఎత్తు: 805 mm
  • గ్రౌండ్ క్లియరెన్స్: 170 mm
  • బరువు (కర్బ్): 195 కిలోలు
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ: 13 లీటర్లు
  • వీల్స్: అల్లాయ్, స్పోక్ వీల్ ఆప్షన్స్

రెట్రో లుక్, మోడ్రన్ టచ్

  • ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్: అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు ఫ్యూయల్ లెవెల్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ చూపే చిన్న డిజిటల్ డిస్‌ప్లే
  • లైటింగ్: ఫుల్ LED లైటింగ్ సిస్టమ్ (హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్లు)