కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌కు క్యాబినెట్ ఆమోదం.. ఇక అసెంబ్లీలో రిపోర్టుపై చర్చ.. ఆ తర్వాత నిర్ణయం: రేవంత్ రెడ్డి

"కమిషన్‌కు కవిత సమాచారం ఇచ్చుంటే బాగుండేది. ప్రభుత్వం ఎక్కడా కక్ష పూరితంగా వ్యవరించలేదు" అని అన్నారు.

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌కు క్యాబినెట్ ఆమోదం.. ఇక అసెంబ్లీలో రిపోర్టుపై చర్చ.. ఆ తర్వాత నిర్ణయం: రేవంత్ రెడ్డి

Updated On : August 4, 2025 / 9:29 PM IST

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా మేడిగడ్డకు మార్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

“కాళేశ్వరం నిర్మాణం జరిగిన మూడేళ్లకు కూలింది. అన్నారం, సుందిళ్లకు పగుళ్లు వచ్చాయి. కాళేశ్వరం నిర్మాణ, నిర్వాణం, ఆపరేషన్ లోపాలు స్పష్టంగా ఉన్నాయి. నాటి ప్రభుత్వం ప్రాజెక్టులో అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడింది.

Also Read: కాళేశ్వరంలో మొత్తం తప్పు కేసీఆర్ దే .. తేల్చేసిన కమిషన్.. రిపోర్ట్ బయటపెట్టిన ఉత్తమ్

పీసీ ఘోష్ కమిటీ పదహారు నెలలు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేసింది. కేసీఆర్, హరీశ్, ఈటలను కమిషన్ ప్రశ్నించి, విశ్లేషించి తుది నివేదిక ఇచ్చింది. కమిషన్ రిపోర్ట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఊరు, పేరు మార్చి, అవినీతి కి పాల్పడి, అడ్డుగోలు అంచనాలు పెంచి నిర్మించిన కాళేశ్వరం కూలింది. అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పై చర్చిస్తాం..

అందరి అభిప్రాయాలు చెప్పొచ్చు. చర్చ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కమిషన్ రిపోర్ట్ రాజకీయ,రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు. కవిత.. కమిషన్ కు సమాచారం ఇచ్చుంటే బాగుండేది. ప్రభుత్వం ఎక్కడ కక్ష పూరితంగా వ్యవరించలేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “నీళ్ల కోసం కోట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే.. లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం కూలింది. కాళేశ్వరం అవకతవకలకు కారణం కేసీఆరేనని కమిషన్ గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, ఆపరేషన్, మెయింటనెన్స్ లను కేసీఆర్ పాటించలేదు. అన్నింటికీ పరోక్షంగా, ప్రత్యక్షంగా కేసీఆర్‌ కారణం. కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ చెప్పింది” అని అన్నారు.