కాళేశ్వరంలో మొత్తం తప్పు కేసీఆర్ దే .. తేల్చేసిన కమిషన్.. రిపోర్ట్ బయటపెట్టిన ఉత్తమ్

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్‌లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.

కాళేశ్వరంలో మొత్తం తప్పు కేసీఆర్ దే .. తేల్చేసిన కమిషన్.. రిపోర్ట్ బయటపెట్టిన ఉత్తమ్

Updated On : August 4, 2025 / 7:38 PM IST

కాళేశ్వరం డిజైన్, ప్లానింగ్ అంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్ వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని కమిటీ చెప్పిందన్నారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

మేడిగడ్డ వద్ద కట్టొద్దని సూచించినా కేసీఆర్ వినలేదని చెప్పారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్‌లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.

తుమ్మిడిహట్టి, మేడిగడ్డకు మార్చడం వెనక నిజాయితీ లేదు. తుమ్మిడిహట్టిలో 205 టీఎంసీల నీటి లభ్యత ఉండదని.. హైడ్రాలజీ క్లియరెన్స్ ఇస్తున్నామని నాటి కేంద్రమంత్రి ఉమాభారతి లేఖరాశారు. సీడబ్ల్యూసీ కూడా ఇదే చెప్పింది. కేంద్రమంత్రి లేఖను కేసీఆర్ పక్కనబెట్టారు.

తొమ్మిడిహట్టిలో నీళ్లు లేవనడం.. కేవలం సాకు మాత్రమే.. నాటి ప్రభుత్వం అబద్ధం చెప్పింది. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ కూడా మేడిగడ్డ వద్ద నిర్మించవద్దని సూచించిందీ. ఆ రిపోర్టును కేసీఆర్ పట్టించుకోలేదు. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేమనపల్లి దగ్గర కట్టాలని చెప్పింది. కేసీఆఆర్, హరీశ్ కావాలనే రిపోర్టు లను పక్కనపెట్టారని కమిషన్ చెప్పింది. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టి ప్రాజెక్ట్ నిర్మించారు. మేడిగడ్డ సరైంది కాదు.. రిపోర్టులు ఉన్నా కేసీఆర్ పట్టించుకోలే.

క్యాబినెట్ అనుమతిలేకుండా 2,591 కోట్ల రూపాయలకు ఇరిగేషన్ మంత్రి జీవోతో అనుమతి ఇచ్చారని కమిషన్ గుర్తించింది. నామినేషన్ ద్వారా అడిషనల్ వర్క్స్ కాంట్రాక్టర్స్ ఇచ్చారు. క్యాబినెట్ అనుమతి లేకుండా సీఎం ఇచ్చారు .. ఇది నిబంధనలకు వ్యతిరేకం. ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు కట్టబెట్టారు. ప్రపంచంలో ఎక్కడా బ్యారేజీలలో నీటిని నిల్వచేయరు. ఇక్కడ బ్యారేజిలో ఎక్కువ నీళ్లు నిల్వచేయడం వల్లనే కూలింది” అని అన్నారు.

“కాళేశ్వరంపై ఇప్పటి వరకు రూ.29 వేల కోట్ల మిత్తి చెల్లించింది మా ప్రభుత్వం. నిరుపయోగ కాళేశ్వరంతో తెలంగాణకు భారీ నష్టం.
ప్రాజెక్ట్ లో ప్రతి చిన్న విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకున్నారని కమిషన్ గుర్తించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాలు లాజికల్ గా జరుగలేదు. కాళేశ్వరానికి కేబినెట్లో ఆమోదం లేదని కమిషన్ చెప్పింది.

నిబంధనలు ఉల్లంఘించి ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మాణం సరికాదని కమిషన్ పేర్కొంది. ఎక్కడా బిజినెస్ రూల్స్ ప్రభుత్వం పాటించలేదు.
ఈటల ఆర్ధిక మంత్రిగా సమర్థంగా వ్యవరించలేదు. కేసీఆర్, హరీశ్, ఈటల పూర్తిగా నిర్లక్ష్యం, అలక్ష్యంగా వ్యవహరించారు” అని చెప్పారు.