Lamborghini Temerario
Lamborghini Temerario : కొత్త కారు కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి లంబోర్గిని టెమెరారియో కొత్త కారు వచ్చేస్తోంది. ఈ నెల 30న లంబోర్గిని దేశ మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఆగస్టు 2024లో ఈ లంబోర్గిని కారు వివరాలు వెల్లడయ్యాయి.
కానీ, ఇప్పుడు ఆ సూపర్‌కార్ మన దేశానికి చేరుకుంటోంది. హురాకాన్ అప్‌గ్రేడ్ ముందుగా మాంటెరీ కార్ వీక్‌లో కనిపించగా ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి వస్తోంది. లంబోర్గిని టెమెరారియో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంజిన్, పవర్‌ట్రెయిన్ :
లంబోర్గిని టెమెరారియో 4.0-లీటర్ V8 ఇంజిన్‌తో రన్ అవుతుంది. 8-స్పీడ్ DCT, 3.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో నడిచే 3 ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి వరుసగా 920HP, 800Nm గరిష్ట శక్తిని, టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగంతో పాటు గంటకు 343 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
డిజైన్ వివరాలు :
లంబోర్గిని టెమెరారియో డిజైన్ హురాకాన్ హింట్ కలిగి ఉంది. షార్క్-నోస్ ఫ్రంట్ ఎండ్, లోయర్-లిప్ స్పాయిలర్, స్వెప్ట్ బ్యాక్ LED హెడ్‌లైట్లు కలిగి ఉంది. టెమెరారియో ఫ్రంట్ సైడ్ కనిపించే హెగ్జాగోనల్ షేపడ్ LED DRL కూలింగ్ కోసం ఎయిర్ ఛానెల్‌లను కలిగి ఉంటాయి. కొత్త అల్యూమినియం సబ్‌ఫ్రేమ్‌తో లంబోర్గిని టెమెరారియో టోర్షనల్ హురాకాన్ కన్నా 20 శాతం పెరిగింది. 25 కిలోల వెయిట్ తక్కువగా ఉండేలా బ్రాండ్ కొన్ని కార్బన్ ఫైబర్ ఎలిమెంట్లను కూడా చేర్చింది.
ఇంటీరియర్ :
లంబోర్గిని టెమెరారియో లోపలి భాగంలో 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్, 9.1-అంగుళాల ప్యాసింజర్ స్క్రీన్‌ను డాష్‌బోర్డ్‌కు అమర్చారు. ఈ బ్రాండ్ స్పోర్టీ అప్పీల్‌తో పాటు డ్రైవర్ సౌకర్యంపై దృష్టి సారించింది. 18-వేస్ పవర్ అడ్జెస్ట్ డ్రైవర్ సీటును కలిగి ఉంది. వేడిగాలి పోయి వెంటిలేషన్ వచ్చేలా ఉంటుంది.
ధర (అంచనా) :
లంబోర్గిని టెమెరారియో కారు ధర దాదాపు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత మార్కెట్లో మెక్‌లారెన్ 750S, ఫెరారీ 296 GTBలతో పోటీపడుతుంది.