ChatGPT Plus : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏఐ ChatGPT ప్లస్ ఫ్రీగా పొందొచ్చు.. ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే? ఫుల్ డిటెయిల్స్..!

ChatGPT Plus Free : ఓపెన్ఏఐ ప్రీమియం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను విద్యార్థుల కోసం 31 మే 2025 వరకు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే?

ChatGPT Plus : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏఐ ChatGPT ప్లస్ ఫ్రీగా పొందొచ్చు.. ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే? ఫుల్ డిటెయిల్స్..!

ChatGPT Plus Free

Updated On : April 4, 2025 / 3:52 PM IST

ChatGPT Plus Free : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ విద్యార్థుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. చాట్‌జీపీటీ ప్లస్ అకౌంట్ యాక్సస్ ఉచితంగా అందిస్తోంది. ముందుగా యునైటెడ్ స్టేట్స్, కెనడాలో డిగ్రీ పొందిన విద్యార్థులకు మాత్రమే చాట్‌జీపీటీ ప్లస్‌ను ఉచితంగా 31, మే 2025 వరకు ఉపయోగించవచ్చని ఓపెన్ఏఐ ప్రకటించింది.

మార్చి 31న ప్రారంభమైన ఈ ఉచిత ఆఫర్ విద్యార్థులకు పరీక్షల సమయంలో ప్రీపేర్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా నెలకు 20 డాలర్ల ధరకే లభించే చాట్‌జీపీటీ ప్లస్ వినియోగదారులకు GPT-4o, ఇమేజ్ జనరేషన్, అడ్వాన్స్ వాయిస్ మోడ్, ప్రత్యేక రీసెర్చ్ టూల్స్ వంటి ప్రీమియం ఫీచర్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఏఐ టూల్స్ తాత్కాలికంగా విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

Read Also : SIP Investment : మీ జీతం పడిందా? డబ్బుతో డబ్బు సంపాదించొచ్చు.. రూ.30వేల పెట్టుబడితో రూ. 5 కోట్లకు పైగా రాబడి.. ఎలాగంటే?

ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలి? :
“యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని డిగ్రీని పూర్తి చేసిన పార్ట్ టైమ్ విద్యార్థులు ఈ ఆఫర్‌కు అర్హులు” అని కంపెనీ స్పష్టం చేసింది. స్టూడెంట్ వెరిఫికేషన్ లిస్టులో మీ స్కూల్ కనిపించకపోతే మా పార్టనర్ నుంచి హెల్ప్ కోసం దయచేసి ఈ లింక్‌పై క్లిక్ చేయండి. మీ స్కూల్ యాడ్ అవుతుంది.

మీ స్కూల్ లేదా కాలేజీ ఈ ఆఫర్‌కు అర్హత కలిగి ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు (SheerID) ద్వారా తమ రిజిస్ట్రేషన్ స్టేటస్ వెరిఫై చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ తర్వాత చాట్‌జీపీటీకి రీడైరెక్ట్ అవుతారు. రెండు నెలల సభ్యత్వంతో అకౌంట్ ఆటోమాటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. అర్హత సాధించిన ప్రస్తుత చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రైబర్‌లు కూడా ఫ్రీ ఆఫర్ క్రెడిట్‌ను అందుకుంటారు.

చాట్‌జీపీటీ ప్లస్‌తో విద్యార్థులకు లాభమేంటి? :
చాట్‌జీపీటీ ప్లస్‌ ఆఫర్ ద్వారా విద్యార్థులు తమ చదువులకు వివిధ మార్గాల్లో అవసరమైన విషయాలను తెలుసుకునేందుకు చాట్‌జీపీటీ ప్లస్‌ను ఉపయోగించవచ్చు.

  • లెక్చరర్ నోట్స్ లేదా రీడింగ్స్ ఫ్లాష్‌కార్డ్‌లుగా మార్చడం
  • కాలిక్యులస్ లేదా ఫిలాసఫీ వంటి సంక్లిష్ట విషయాలను సరళమైన పదాలలో వివరించడం
  • వ్యాసాలు లేదా ప్రాజెక్ట్ ఐడీయాలజీపై చర్చించడం
  • APA, MLA లేదా చికాగో స్టయిల్స్ సైటేషన్స్ క్రియేట్ చేయడం
  • రీసెర్చ్ డాక్యుమెంట్ల నుంచి డేటాను ట్రాన్సులేట్ చేయడం
  • వ్యక్తిగత ప్రకటనలు లేదా అప్లికేషన్ వ్యాసాలు రాయడం
  • గ్రామర్ ప్రాక్టీసింగ్, వోకాబులరీ వంటి భాషలను నేర్చుకోవడం

ఏఐతో విద్యపరంగా అనేక మార్పులు :
విద్యార్థుల విద్యారంగంలోకి ఏఐ ప్రవేశంతో అనేక మార్పులు రానున్నాయి. కేవలం టూల్స్ గురించి మాత్రమే కాదు.. కాలేజీ విద్యార్థులు ఇప్పటికే చాట్‌జీపీటీ ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థుల్లో మూడింట ఒక వంతు మంది ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు.

దాదాపు 25శాతం చదువుకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతున్నారు. మరో AI కంపెనీ ఆంత్రోపిక్ కూడా ఈ వారమే క్లాడ్ ఫర్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. లెర్నింగ్ మోడ్ వంటి యూనివర్శిటీల కోసం రూపొందించిన ఫీచర్లను కలిగి ఉంది. నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తో ప్రయోగాత్మకంగా దీన్ని రన్ చేస్తున్నారు.

ఏఐ ఇంతగా డెవలప్ అయినప్పటికీ చాలామంది విద్యార్థుల్లో చాట్‌జీపీటీ వంటి టూల్స్ వినియోగం చాలా తక్కువగా ఉంది. అందుకే ChatGPT ప్లస్‌ను ఫ్రీగా అందించడం ద్వారా ఓపెన్ఏఐ డిజిటల్ వినియోగాన్ని మరింత పెంచాలని భావిస్తోంది.

కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ వ్యవస్థలోని కొన్ని యూనివర్శిలు ఓపెన్ఏఐతో అధికారిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని యూనివర్శిటీలలో చాలా మంది విద్యార్థులకు ప్రీమియం ఏఐ టూల్స్ పరిమితంగా లేదా అసలు యాక్సస్ ఉండదు. ఆర్థిక లేదా భౌగోళిక అడ్డంకులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ ఓపెన్ఏఐ ఉచిత ఆఫర్ మరింత చేయూతనిస్తోంది.

విద్యార్థుల కోసం కొత్త లెర్నింగ్ టూల్స్ :
లెర్నింగ్ టూల్స్ కేవలం యాక్సెస్ మాత్రమే కాదు.. చాట్‌జీపీటీ ప్లస్‌ను ఉపయోగించే విద్యార్థులకు మరింత అవగాహన కల్పిస్తాయి. ఇందుకోసం ఓపెన్ఏఐ కొత్త లెర్నింగ్ ప్లా్ట్‌ఫారాలను కూడా ప్రారంభించింది. ఓపెన్ఏఐ అకాడమీ విద్యార్థులు ఏఐపై పట్టు సాధించడంలో సాయపడుతాయి.

అయితే, చాట్‌జీపీటీ ల్యాబ్ ఒకరితో ఒకరు ప్రాంప్ట్‌లు, ఐడియాలను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఓపెన్ఏఐ కేవలం యాక్సెస్‌ మాత్రమే కాదు.. లెర్నింగ్ వంటి మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. విద్యార్థులు ఏఐని కేవలం షార్ట్‌కట్‌గా కాకుండా మరింత ఆలోచనాత్మక మార్గాల్లో వినియోగించుకోవచ్చు.

మే తర్వాత ఫ్రీ ఆఫర్ పొడిగింపు? :
చాట్‌జీపీటీ ఫ్రీ ఆఫర్ ముగిసిన తర్వాత విద్యార్థులు పేమెంట్ సబ్‌స్ర్కి్ప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం ఛార్జీ చెల్లించక ముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓపెన్ఏఐ అందించే ఈ ఆఫర్ ప్రమోషనల్ డీల్ కాదనే చెప్పాలి. విద్య భవిష్యత్తు కోసం ఒక పరీక్ష లాంటిది. విద్యార్థుల చేతుల్లో ఉంది. ఉన్నత విద్యలో ఏఐపై ఎలా అధ్యయనం చేస్తారు? ఎలా పరిశోధన చేస్తారు అనేది చూస్తారు.

Read Also : Poco C71 Launch : అన్ని ఫోన్లలా కాదు భయ్యా.. ఈ కొత్త పోకో C71 క్రేజే వేరబ్బా.. తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ దొరకదు!

చాట్‌జీపీటీ ప్లస్ ఫ్రీ ఆఫర్ మే తర్వాత కూడా పొడిగించకపోవచ్చు. చాట్‌జీపీటీ వంటి టూల్స్ హ్యుమన్ టీచింగ్ విధానాన్ని భర్తీ చేయలేకపోయినా విద్యార్థులకు అవగాహన పొందవచ్చు. యూనివర్శిటీలు మాత్రం కొత్త AI-ప్రూఫ్ టాస్కులను రూపొందిస్తాయా లేదా మరింత క్రియేటివిటీపై మొగ్గు చూపుతాయా? అనేది చూడాలి.