SIP Investment : మీ జీతం పడిందా? డబ్బుతో డబ్బు సంపాదించొచ్చు.. రూ.30వేల పెట్టుబడితో రూ. 5 కోట్లకు పైగా రాబడి.. ఎలాగంటే?

SIP Investment : అందరూ డబ్బులు సంపాదిస్తారు. కానీ, కొందరే ఆ డబ్బును పొదుపుగా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు కానీ ప్రతినెలా రూ.30వేల పెట్టుబడితో SIP ప్రారంభిస్తే 25ఏళ్లలో రూ. 5 కోట్లకుపైగా సంపాదిస్తారు.

SIP Investment : మీ జీతం పడిందా? డబ్బుతో డబ్బు సంపాదించొచ్చు.. రూ.30వేల పెట్టుబడితో రూ. 5 కోట్లకు పైగా రాబడి.. ఎలాగంటే?

Money Saving Tips

Updated On : April 4, 2025 / 2:28 PM IST

SIP Investment : మీకు జీతం పడిందా? ఈ నెల జీతం పడితే వెంటనే ఈ పనిచేయండి. ప్రతినెలా అందరికి ఖర్చులు కామన్.. ఇప్పటినుంచి సేవింగ్స్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే.. భవిష్యత్తులో రిటైర్మెంట్ అయ్యాక ఈ డబ్బులే మిమ్మల్ని పోషిస్తాయి. ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగా మీ డబ్బులతోనే జీవితమంతా గడిపేయొచ్చు.

Read Also : Tata Nano EV Car : తగ్గేదేలే.. టాటా నానో కారు రీఎంట్రీ..? క్రేజీ లుక్‌తో ఎలక్ట్రిక్ అవతార్‌గా వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ రేంజ్!

మీరు కూడా ఇలా జీవించాలని అనుకుంటే ఇప్పుడే మీ డబ్బును పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఇలా చేస్తే మీరు కూడా డబ్బుతో డబ్బు సంపాదించవచ్చు. కానీ, సరైన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. సరైన పెట్టుబడి ప్రణాళికతో మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా కోట్ల డబ్బులను కూడబెట్టవచ్చు. SIP సాయంతో మీరు 25 ఏళ్లలో ఏకంగా రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు.

సరైన సమయంలో సరైన దగ్గర పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలంటే.. వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి.

మీరు కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. SIP మీకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. మీకు ప్రస్తుతం 30 ఏళ్లు ఉంటే.. 55 సంవత్సరాల వయస్సు వరకు SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లక్షాధికారి కావచ్చు. అందుకే SIP డబ్బు సంపాదించే (30+12+25) ఫార్ములా ఏమి చెబుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

SIP మ్యాజిక్ ఇదే.. :
మీరు కోటీశ్వరుడు కావాలనుకుంటే ముందుగా సరైన SIP పెట్టుబడి ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు ఉంటే.. రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరుడు కావాలనుకుంటే.. వెంటనే SIPలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీరు ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. కేవలం 25 ఏళ్లలో కోట్ల విలువైన డబ్బును కూడబెట్టుకోవచ్చు.

అయితే, ఎస్ఐపీ (SIP)లో పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు (30+12+25) ఫార్ములాను తప్పక పాటించాలి. తద్వారా మీరు సులభంగా కోటీశ్వరుడు కావచ్చు. ఈ ఫార్ములా ప్రకారం.. మీరు రూ. 30వేల పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి.

ఈ పెట్టుబడిపై మీకు దాదాపు 12 శాతం రాబడి లభిస్తుంది. అప్పుడు ఈ పెట్టుబడిని దాదాపు 25 ఏళ్లు అలానే కొనసాగించాల్సి ఉంటుంది. అయితే, మీరు ఈ రూ. 30వేల పెట్టుబడిని 25 ఏళ్ల పాటు ఆపకుండా అలానే కొనసాగించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

25ఏళ్లలో రూ. 5 కోట్లకుపైగా.. :
కోటీశ్వరుడు అయ్యేందుకు మీరు 25 ఏళ్ల పాటు ప్రతినెలా రూ. 30వేలు పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. ఈ పెట్టుబడిపై మీరు 12శాతం రాబడిని పొందవచ్చు. మీ పెట్టుబడి మొత్తం దాదాపు రూ. 90లక్షలు ఉంటుంది.

ఈ పెట్టుబడిపై మీకు దాదాపు రూ. 4,20,66,197 రాబడి వస్తుంది. ఆ తరువాత 25 ఏళ్ల తర్వాత మీకు దాదాపు రూ. 5,10,66,197 కోట్ల విలువైన డబ్బు వస్తుంది. అంటే మీరు రూ. 30వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా 25 ఏళ్లలో రూ. 5 కోట్లకు పైగా డబ్బులను సంపాదించవచ్చు.

Read Also : Poco C71 Launch : అన్ని ఫోన్లలా కాదు భయ్యా.. ఈ కొత్త పోకో C71 క్రేజే వేరబ్బా.. తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ దొరకదు!

15శాతం రేటుతో ఎంత వస్తుందంటే? :
మీరు అదే పెట్టుబడి కాల వ్యవధిని 15శాతం రేటుతో లెక్కిస్తే.. అప్పుడు మీ ఆదాయం ఇంకా భారీగా పెరుగుతుంది. మీరు రూ. 30వేలపై 15శాతం రాబడితో 25 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగిస్తే.. మీకు రూ. 8 కోట్లకు పైగా రాబడి వస్తుంది.

మీ పెట్టుబడి మొత్తం దాదాపు రూ. 90లక్షలు ఉంటుంది. ఈ పెట్టుబడిపై మీరు దాదాపు రూ.7,36,96,823 రాబడిని పొందుతారు. ఆ తరువాత 25 ఏళ్ల తర్వాత మీకు మొత్తం రూ. 8,26,96,823 డబ్బులు చేతికి అందుతాయి.

Note : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. SIPలో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోండి.