Tata Nano EV Car : తగ్గేదేలే.. టాటా నానో కారు రీఎంట్రీ..? క్రేజీ లుక్‌తో ఎలక్ట్రిక్ అవతార్‌గా వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ రేంజ్!
Tata Nano EV Car : కొత్త టాటా నానో EV కారు వస్తోంది.. కంపెనీ ఎంట్రీ-లెవల్ EV అవతార్ కావచ్చు. ఎంట్రీ-లెవల్ కార్ కొనుగోలుదారులకు అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది.

Tata Nano might relaunch soon
Tata Nano EV Car : కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అతి త్వరలో టాటా నానో రీఎంట్రీ ఇవ్వనుంది. ఈసారి టాటా నానో EV కారుగా రాబోతుంది. ఒకప్పుడు టాటా నానో భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు టాటా నానో ఈవీ అవతార్‌గా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఏళ్ల క్రితం టాటా నానో భారత మార్కెట్లో కంపెనీ అందించే అత్యంత సరసమైన కారుగా చెప్పవచ్చు.
అయితే, ఈ చిట్టిపొట్టి కారుకు పెద్దగా మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల టాటా నానో తయారీని మూసివేయాల్సి వచ్చింది. అయితే, ఇటీవలి నివేదికల ప్రకారం.. కంపెనీ త్వరలో నానోను తిరిగి భారత్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది. అదే నిజమైతే.. కొత్త టాటా నానో ఒక ఎలక్ట్రిక్ వాహనంగా అడుగుపెట్టనుంది.
అయితే, ఇది ICE ఆధారిత కారు కాదని నివేదికలు చెబుతున్నాయి. అంటే.. గ్యాసోలిన్ లేదా డీజిల్ ఇంధనం వంటి సాంప్రదాయ, చమురుతో నడిచే ఆటోమొబైల్ కారు కాదని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే.. టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా రానుంది.
కొత్త టాటా నానో EV కంపెనీ అందించే ఎంట్రీ-లెవల్ EV కావచ్చు. ఎంట్రీ-లెవల్ కార్ కొనుగోలుదారులకు సరసమైన ధరకే లభ్యం కానుంది. ప్రస్తుతం, టాటా మోటార్స్ రోడ్డుపై అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల (కార్లు)ను కలిగి ఉంది. నానో ఈవీ కారుతో ఈ సెగ్మెంట్ మరింత బలోపేతం చేయాలని కంపెనీ యోచిస్తోంది. టియాగో, టిగోర్, నెక్సాన్ EV (ప్రైమ్, మాక్స్)లను ప్రస్తుతం కంపెనీ భారత మార్కెట్లో అందిస్తోంది.

Tata Nano EV Car
టాటా నానో EV కారు భారత్‌లో లాంచ్ అయితే, దానికి భారీ అప్‌గ్రేడ్‌లు (బ్యాటరీ, మోటారు కాకుండా) లభిస్తాయి. కొత్త నానో అప్‌గ్రేడ్ చేసిన క్యాబిన్ ఫీచర్‌లతో పాటు (ICE వెర్షన్‌తో పోలిస్తే) కొత్త ప్లాట్‌ఫామ్‌ను పొందవచ్చు. అయితే, మనకు నానో ఒకే డిజైన్ (ఐకానిక్) లభించవచ్చు. ఈ కారులో అందించే మోటారు ఇతర టాటా ఈవీ కార్ల కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ టాటా కారును ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 200 కి.మీ రేంజ్ అందిస్తుంది.
టాటా నానో జర్నీ ఇలా:
కంపెనీ రూపొందించిన టాటా నానో EV గురించి మరిన్ని వివరాలను తెలియాల్సి ఉంది. తయారీదారు ఇప్పటికే రాబోయే 5 ఏళ్లలో 10 మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. టాటా నానో 2008లో రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది.
Read Also : iPhone 16 : ఇలా చేస్తే.. రూ.79,900 ఫోన్ రూ.27,250కే.. Filpkartలో IPhone 16పై బంపర్ ఆఫర్..!
అయితే, తక్కువ అమ్మకాల కారణంగా 2018లో ఆ కారు తయారీని నిలిపివేశారు. భారత మార్కెట్లో అనేక గృహాల్లో నానో భాగమైందని, యజమానులు ఆ కారు పట్ల గర్వపడుతున్నారు. మళ్లీ ఇలాంటి టాటా నానో కారు వస్తే బాగుండు అని చాలామంది టాటా అభిమానులు ఆశపడుతున్నారు.