iPhone 16 : ఇలా చేస్తే.. రూ.79,900 ఫోన్ రూ.27,250కే.. Filpkartలో IPhone 16పై బంపర్ ఆఫర్..!
iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? రూ. 79,900 విలువైన ఐఫోన్ 16 కేవలం రూ.27,250 ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16
iPhone 16 : కొత్త ఐఫోన్ కావాలా? మీకోసం భారీ తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 16 అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఐఫోన్ 16 మోడల్ కొనుగోలుపై ఏకంగా రూ. 9వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అదనపు సేవింగ్స్ కోసం బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీరు కొత్త ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే సరైన సమయం.
సెప్టెంబర్ 2024లో లాంచ్ అయిన ఈ లేటెస్ట్ iPhone 16 మోడల్ ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. అత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లు, ఆపిల్ లేటెస్ట్ A18 చిప్‌సెట్‌తో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు గతంలో కన్నా అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఇంతకీ ఈ ఐఫోన్ 16 కేవలం రూ. 27,250కే ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 డిస్కౌంట్ :
ఐఫోన్ 16 (128GB) ధర ప్రారంభంలో రూ. 79,900గా ఉండేది. కానీ, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఈ ఐఫోన్ 16ను కేవలం రూ. 74,900కే అందిస్తోంది. అంటే.. 6శాతం తగ్గింపు అనమాట. ఈ ధర తగ్గింపుతో పాటు, కస్టమర్లు ప్రత్యేకమైన బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా మరింత తగ్గించుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు :
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ నాన్-EMI వినియోగదారులకు రూ. 2,500 తగ్గింపు అందిస్తోంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ :
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోండి. ఈ ఐఫోన్ మోడల్, స్టేటస్ బట్టి రూ. 41,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రెండు ఆఫర్లతో కొనుగోలుదారులు అద్భుతమైన సేవింగ్స్ పొందవచ్చు. ఐఫోన్ 16 అతి తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లొచ్చు.
ఐఫోన్ 16 కొనాలా? వద్దా? :
ఆపిల్ ఏఐ ఆధారిత ఆపిల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను iOS 18.2తో ఆవిష్కరించింది. ఐఫోన్ 16 ఫస్ట్ ఏఐ ఆధారిత ఐఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. A18 చిప్, 8GB ర్యామ్ డివైజ్ పవర్ అందిస్తాయి. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లతో అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఐఫోన్ 16 మోడల్ 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు 48MP ఫ్యూజన్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ యూజర్లు అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. అతి తక్కువ ధరలో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునే యూజర్లకు ఐఫోన్ 16 అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.