Poco C71 Launch : అన్ని ఫోన్లలా కాదు భయ్యా.. ఈ కొత్త పోకో C71 క్రేజే వేరబ్బా.. తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ దొరకదు!

Poco C71 Launch : కొత్త ఫోన్ కావాలా? భారత మార్కెట్లోకే ఇప్పుడే పోకో C71 ఫోన్ దిగింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి ఫోన్ ఇప్పటికప్పుడూ దొరకడం కష్టమే..

Poco C71 Launch : అన్ని ఫోన్లలా కాదు భయ్యా.. ఈ కొత్త పోకో C71 క్రేజే వేరబ్బా.. తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ దొరకదు!

Poco C71 launched in India

Updated On : April 4, 2025 / 2:00 PM IST

Poco C71 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి పోకో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. కేవలం రూ. 10వేల లోపు విభాగంలో కొత్త బడ్జెట్ ఫోన్ Poco C71 అధికారికంగా లాంచ్ అయింది. ఈ పోకో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 6GB వరకు ర్యామ్, డ్యూయల్ టోన్ డిజైన్‌తో సహా కొన్ని ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది.

Read Also : iPhone 16 : ఇలా చేస్తే.. రూ.79,900 ఫోన్ రూ.27,250కే.. Filpkartలో IPhone 16పై బంపర్ ఆఫర్..!

పోకో C61కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ ఫోన్. TUV లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సిర్కాడియన్ సర్టిఫికేషన్స్ మరిన్నింటితో ఈ సెగ్మెంట్‌లో అత్యంత ఆకర్షణీయమైన డిస్‌ప్లేను అందిస్తుంది. పోకో C71 ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

పోకో C71 స్పెసిఫికేషన్లు :
పోకో C71 ఫోన్ 6.88-అంగుళాల HD+ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్, 600 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్‌తో వస్తుంది. వెట్ టచ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 6GB వరకు ర్యామ్, 128GB స్టోరేజీ (2TB వరకు)తో Unisoc T7250 SoC ద్వారా పవర్ పొందుతుంది.

ఈ పోకో ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. పోకో C71 ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. ఈ 2 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. పోకో ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IP52 రేటింగ్‌ను కూడా పొందుతుంది. కెమెరాల విషయానికొస్తే.. పోకో C71 ఫోన్ 32MP బ్యాక్ కెమెరాతో పాటు 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Read Also : Tata Nano EV Car : తగ్గేదేలే.. టాటా నానో కారు రీఎంట్రీ..? క్రేజీ లుక్‌తో ఎలక్ట్రిక్ అవతార్‌గా వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ రేంజ్!

భారత్‌లో పోకో C71 ధర, లభ్యత :
పోకో C71 5G ఫోన్ 4GB, 64GB వేరియంట్ ధర రూ. 6,499గా ఉండగా, టాప్-ఎండ్ 6GB, 128GB వేరియంట్ ధర రూ. 7,499గా ఉంది. ఏప్రిల్ 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు డెసర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.