Lava Yuva 4 Launch : 50ఎంపీ ప్రైమరీ కెమెరా, భారీ బ్యాటరీతో లావా యువ 4 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!

Lava Yuva 4 Launch : భారత మార్కెట్లో లావా యువ 4 ఫోన్ 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ప్రారంభ ధర 6,999, 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 7,499గా ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ధృవీకరించారు.

Lava Yuva 4 Launch : 50ఎంపీ ప్రైమరీ కెమెరా, భారీ బ్యాటరీతో లావా యువ 4 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!

Lava Yuva 4 With 50MP Main Camera, 5,000mAh Battery Launched

Updated On : November 28, 2024 / 8:53 PM IST

Lava Yuva 4 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? లావా యువ 4 యునిసోక్ T606 చిప్‌సెట్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 230,000 కన్నా ఎక్కువ (AnTuTu) స్కోర్‌ను సాధించినట్లు కంపెనీ క్లెయిమ్ చేసింది.

50ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్, 5,000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ప్రత్యేకంగా కొనుగోలుకు అందుబాటులో ఉంది. గత ఫిబ్రవరిలో దేశంలో ఆవిష్కరించిన లావా యువ 3కి అప్‌గ్రేడ్ వెర్షన్ గా లావా యువ 4 ఫోన్ వచ్చింది.

భారత్‌లో లావా యువ 4 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో లావా యువ 4 ఫోన్ 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ప్రారంభ ధర 6,999, 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 7,499గా ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ధృవీకరించారు. ఈ ఫోన్ గ్లోజీ బ్లాక్, గ్లోజీ పర్పుల్, గ్లోసీ వైట్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం దేశంలో ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. లావా యువ 4 ఫోన్ ఏడాది వారంటీ, ఫ్రీ హోమ్ సర్వీసింగ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటనలో ధృవీకరించింది.

లావా యువ 4 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
లావా యువ 4 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో యూనిసోక్ టీ606 ఎస్ఓసీ ద్వారా పొందుతుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. కెమెరా విభాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను పొందుతుంది.

ఫ్రంట్ కెమెరా ముందు ప్యానెల్ పైభాగంలో సెంట్రలైజడ్ హోల్-పంచ్ స్లాట్‌లో ఉంది. లావా యువ 4 10డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. భద్రత విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చి ఉంటుంది. ఈ ఫోన్ “గ్లోసీ బ్యాక్ డిజైన్”ని కలిగి ఉండవచ్చు.

Read Also : iQOO 13 Launch : వచ్చే వారమే ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు, ధర లీక్..!