Lexus ES Luxury Plus : కొత్త కారు చూశారా? లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్.. భారత్‌లో ధర ఎంతంటే?
Lexus ES Luxury Plus : భారత మార్కెట్లో స్థానికంగా తయారైన లెక్సస్ ఈఎస్ 300హెచ్ సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తుంది.
Lexus ES Luxury Plus : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం లెక్సస్ ఇండియా ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్‌ను రూ. 69.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఈఎస్ 2024 మొదటి అర్ధభాగంలో మొత్తం అమ్మకాలలో ఈఎస్ 300హెచ్ 55శాతం అందించిన కంపెనీగా నిలిచంది.
భారత మార్కెట్లో స్థానికంగా తయారైన లెక్సస్ ఈఎస్ 300హెచ్ సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తుంది. లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్‌లో కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ-లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, బ్యాక్ సీటు పిల్లో వంటి ఫీచర్లు ఉన్నాయి.
భారత మార్కెట్లో లెక్సస్ 2017లో లాంచ్ అయింది. అన్ని లెక్సస్ కార్లు ఇప్పుడు 8 ఏళ్లు/1 లక్ష 60వేల కిలోమీటర్ల వారంటీని కలిగి ఉన్నాయి. 5 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు. “లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్‌తో రాబోయే పండుగల సీజన్‌లో లగ్జరీ కోషియంట్ కొత్త అప్లియన్సెస్‌తో ఈ ప్రత్యేకమైన ఎడిషన్ అందిస్తుంది.
ఇదో అద్భుతమైన ఆవిష్కరణగా లెక్సస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య పేర్కొన్నారు. “గౌరవనీయమైన కస్టమర్‌లకు ఈ అసాధారణమైన అనుభవాన్ని అందించడానికి సంతోషిస్తున్నాం. భారత మార్కెట్లో లెక్సస్ క్వాలిటీ, నైపుణ్యానికి సంబంధించిన వేడుకగా రూపాంతరం చెందుతుందని నిర్ధారిస్తుంది” అని ఆయన తెలిపారు.
Read Also : Vivo Y300 Pro Launch : వివో నుంచి భారీ బ్యాటరీతో వివో Y300 ప్రో ఫోన్.. అదిరే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?