హైదరాబాద్ మందుబాబులకు హోం డెలివరీలో లిక్కర్
ఈ కాన్సెప్ట్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యుఎస్‌ఏలో దీనికి అమితాదరణ ఉంది. దీనిలో వినియోగదారునికి వర్ట్యువల్ బాటిల్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా సామాజిక మాధ్యమ వేదికలు మిళితమై ఉంటాయి. ఇక్కడ తమ అనుభవాలు చెప్పుకుంటూ పార్టీయింగ్ చేసుకోవచ్చు

Liquor in home delivery in Hyderabad
కేవలం 10 నిమిషాలలో లిక్కర్ హోమ్ డెలివరీ మోడల్ ద్వారా ఈస్ట్ ఇండియాలో అశేష ప్రజాదరణ పొందిన బూజీ ఖర్చు గురించి ఆలోచించే పబ్ గోయర్లను ఆకట్టుకోవడం కోసం హైదరాబాద్‌లో తమ డిస్కౌంటెడ్ ప్రీ పెయిడ్ పెగ్ కాన్సెప్ట్ ను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. దీనిలో భాగంగా వినియోగదారులు తమకు దగ్గరలోని పలు బార్ల నుంచి 30 మిల్లీ లీటర్ల పెగ్‌లను బూజీ యాప్‌పై భారీ డిస్కౌంట్ ధరకు బుక్ చేసుకోవచ్చు.
Holi 2023 Tips : హోలీ రోజున మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త.. పొరపాటున నీళ్లలో ఫోన్ పడితే వెంటనే ఇలా చేయండి.. బెస్ట్ టిప్స్ మీకోసం..!
బూజీ ఫౌండర్-సీఈఓ, వివేకానంద్ (వివేక్) బలిజెపల్లి మాట్లాడుతూ బార్లు, పబ్‌ల వద్ద తన సొంత అనుభవాలతోనే దీనిని తీసుకువచ్చామన్నారు. ఏ పబ్‌కు వెళ్లాలనేది ఎప్పుడూ డైలమాగానే ఉంటుందని, అన్నీ ఒకే చోట లభించి, నచ్చినట్లు పార్టీ చేసుకోలేమా? అదీ కోరుకునే డీల్స్ పొందుతూ అనే భావనతోనే ప్రీ పెయిడ్ పెగ్ (పీపీపీ) కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశామన్నారు. ‘‘ఈ కాన్సెప్ట్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యుఎస్‌ఏలో దీనికి అమితాదరణ ఉంది. దీనిలో వినియోగదారునికి వర్ట్యువల్ బాటిల్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా సామాజిక మాధ్యమ వేదికలు మిళితమై ఉంటాయి. ఇక్కడ తమ అనుభవాలు చెప్పుకుంటూ పార్టీయింగ్ చేసుకోవచ్చు. ఇది కేవలం బుకింగ్ సర్వీస్ మాత్రమే. మద్యం వినియోగం మాత్రం కేవలం లైసెన్సెడ్ ఔట్‌లెట్ వద్ద మాత్రమే జరుగుతుంది’’ అని అన్నారు.
బూజీ తమ సేవలను హైదరాబాద్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పబ్‌లు హార్ట్ కప్ కాఫీ, బేబీ ల్యాంబ్, పాజ్, స్కైలైన్ వంటి వాటితో ప్రారంభించింది. త్వరలోనే ఈ సేవలను బెంగళూరు, గుర్‌గావ్, ముంబై, ఢిల్లీలో ప్రారంభించనున్నారు.