ఈ-జియో పేరిట ఎలక్ట్రిక్‌ ఫోర్ వీలర్‌ను లాంచ్ చేయనున్న మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటి లిమిటెడ్‌.. ప్రత్యేకతలు ఇవే..

‘ఈ-జియో’ సమర్థవంతమైన హై-ఓల్టేజ్‌ ఆర్కిటెక్చర్‌తో వస్తోంది.

ఈ-జియో పేరిట ఎలక్ట్రిక్‌ ఫోర్ వీలర్‌ను లాంచ్ చేయనున్న మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటి లిమిటెడ్‌.. ప్రత్యేకతలు ఇవే..

e-ZEO: ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటి లిమిటెడ్‌ తన సరికొత్త కమర్షియల్ ఎలక్ట్రిక్‌ ఫోర్ వీలర్ పేరును వెల్లడించింది. ఆ సంస్థ అత్యాధునిక ఆవిష్కరణ అయిన ఈ సరికొత్త ఫోర్ వీలర్‌కు ‘ఈ-జియో’గా పేరు పెట్టింది.

‘ఈ-జియో’ పూర్తి పేరు ‘‘జీరో ఎమిషన్‌ ఆప్షన్‌’’. ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని అభివృద్ధి చేశారు. ‘ఈ-జియో’ సమర్థవంతమైన హై-ఓల్టేజ్‌ ఆర్కిటెక్చర్‌తో వస్తోంది. దీనితో పాటు ఖర్చు తక్కువగా ఉండటం వల్ల దీన్ని కొనుగోలు చేస్తే వ్యాపారాలకు దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9వ తేదీన ప్రపంచ ఈవీ దినోత్సవం జరుపుకుంటారు.

ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మహీంద్రాకు తన అంకిత భావాన్ని ‘ఈ-జియో’ ఆవిష్కరణ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటి ఎండీ సుమన్‌ మిశ్రా మాట్లాడుతూ.. ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా తమ ఫోర్ వీలర్ బ్రాండ్‌ పేరును వెల్లడించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ-జియో’ను 2024, అక్టోబరు 3న ప్రారంభిస్తారు.

Also Read : ఈ సెప్టెంబర్‌లో రూ. 30వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫుల్ లిస్టు మీకోసం..!