ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటన కేసులో సంచలన విషయాలు..!

తనకు ఐదు బోట్లు ఉంటే అందులో మూడు మిస్ అయ్యాయని శేషాద్రి తెలిపారు.

ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటన కేసులో సంచలన విషయాలు..!

Prakasam Barrage Boats Incident : ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని విజయవాడ వన్ టౌన్ పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ బోట్ల యజమానులను పిలిచి విచారించారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ ను పోలీసులు ఎంక్వైరీ చేశారు. తనకు ఎలాంటి బోట్లు లేవని రామ్మోహన్ రావు పోలీసులకు తెలిపారు. ఇక, తనకు ఐదు బోట్లు ఉంటే అందులో మూడు మిస్ అయ్యాయని శేషాద్రి తెలిపారు. అయితే, రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా? అనే యాంగిల్ లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉషాద్రితో పాటు రామ్మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లలో కుట్ర కోణం బలపడుతోంది- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

ప్రమాదమా? కుట్ర కోణమా?
1. రాజకీయ కోణంలో ఏమైనా జరిగి ఉంటుందా?
2. ఎప్పుడూ లేని గొల్లపూడి వైపు ఎందుకు నిలిపారు?
3. వారం క్రితమే ఎందుకు ఇటువైపు తీసుకొచ్చారు?
4. మూడు బోట్లను కలిపి ఎందుకు కట్టాల్సి వచ్చింది?
5. ఇనుప గొలుసులతో కాకుండా ప్లాస్టిక్ తాడుతో బోట్లను కట్టడానికి కారణం ఏంటి?
6. స్థానికులు హెచ్చరించినా ఓనర్లు పట్టించుకోలేదా?

బ్యారేజ్ ను 40 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణంపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ముందుగా ఇది ప్రమాదం అనుకున్నా.. దీని వెనుక కుట్రకోణం దాగి ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. భారీ స్థాయిలో బోట్ల ద్వారా ఇసుక తవ్వకాలు జరిపారు రామ్మోహన్. ఎవరూ ఆపకూడదని, ప్రశ్నించకూడదని బోట్లకు వైసీపీ కలర్స్ వేసి నడిపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఈ బోట్లు ఉద్దండరాయునిపాలెం వైపు నిలిపి ఉండేవని తెలుస్తోంది. మళ్లీ నీళ్లలోకి అటువైపు నుంచే వెళ్లేవని, అయితే కొన్ని రోజుల క్రితమే వీటిని గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారు. ఇక వారం క్రితమే ఎందుకు ఇటువైపుకి వచ్చాయి అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి.

గొల్లపూడి రేవు దగ్గర ఉన్న స్మశానం వద్ద మూడు బోట్లను కలిపి కట్టేశారు. సాధారణంగా మూడు బోట్లను కలిపి కట్టరు. కానీ, ఇక్కడ కట్టి ఉంచారు. ఇక ఇనుప చైన్లతో కాకుండా ప్లాస్టిక్ రోప్ తో వీటిని చెట్టుకు కట్టి ఉంచారు. ఇక వాటర్ లెవల్ పెరుగుతూ ఉంటే బోట్లను గట్టిగా కట్టాలని స్థానికులు పలుమార్లు హెచ్చరించినా.. ఓనర్లు లెక్క చేయలేదని దర్యాఫ్తులో తేలింది. ఇక నిందితులకు సంబంధించిన కాల్ డేటా, గూగుల్ టేకౌట్ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.