iPhone 16 Pro Series : కొత్త ఐఫోన్ కావాలా? భారీ కెమెరాల అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. కీలక వివరాలు మీకోసం..!

iPhone 16 Pro Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో మొత్తం 4 స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి.

iPhone 16 Pro Series : కొత్త ఐఫోన్ కావాలా? భారీ కెమెరాల అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. కీలక వివరాలు మీకోసం..!

iPhone 16 and 16 Pro are set to get big camera upgrades, here are the key details

iPhone 16 Pro Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ సిరీస్ రాబోతోంది. ఈ నెల 9న ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ వార్షిక ఈవెంట్ కార్యక్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో మొత్తం 4 స్మార్ట్‌ఫోన్‌లు ఉండవచ్చు. అందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.

ఈ ఐఫోన్ సిరీస్ ఫైనల్ స్పెసిఫికేషన్‌లను లాంచ్‌ ఈవెంట్ సమయంలో రివీల్ చేయనుంది. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే సోమవారం రాత్రి 10.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. లాంచ్‌కు ముందు, ఐఫోన్ కెమెరాకు సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఐఫోన్‌ 16 సిరీస్ భారీ అప్‌గ్రేడ్‌లతో వస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Vivo T3 Ultra Launch : కొత్త వివో టీ3 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!

ఐఫోన్ 16 సిరీస్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్ కెమెరా, డిజైన్ అప్‌గ్రేడ్‌లను అందించనుంది. స్టాండర్డ్ ప్రో మోడల్స్ రెండింటినీ అప్‌డేట్ చేయనుంది.ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. గత మోడల్‌ల మాదిరిగానే కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్స్‌తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 1ఎక్స్, 2ఎక్స్ జూమ్ సామర్ధ్యంతో 48ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, సెకండరీ అల్ట్రా-వైడ్ లెన్స్ వైడ్ రేంజ్ దృశ్యాలకు 0.5ఎక్స్ జూమ్‌ను అందిస్తుంది. ఈ కెమెరాలు ఐఫోన్ 11 డిజైన్‌ మాదిరిగా నిలువుగా ఉంటాయి.

ప్రైమరీ కెమెరా స్పెసిఫికేషన్‌లు ఎఫ్/1.6 ఎపర్చరు, 2ఎక్స్ టెలిఫోటో సామర్థ్యంతో మారకుండా ఉన్నప్పటికీ, అల్ట్రా-వైడ్ లెన్స్ గణనీయమైన అప్‌గ్రేడ్‌ను సూచిస్తుంది. ఎఫ్/2.4 నుంచి వేగవంతమైన ఎఫ్/2.2 ఎపర్చర్‌కి మారుతుంది. సెన్సార్‌ను మరింత కాంతిని తాకేలా చేస్తుంది. తద్వారా తక్కువ-కాంతిలోనూ అద్భుతంగా పనిచేస్తుంది.

ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు మరింత గణనీయమైన మార్పులు ఉండొచ్చునని భావిస్తున్నారు. మొత్తం డిజైన్, గత మోడళ్లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ప్రో లైనప్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. వైడ్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. ప్రాథమిక కెమెరా ఇప్పటికీ 48ఎంపీ ఎఫ్/1.78 ఎపర్చర్‌తో ఉంటుంది. 2ఎక్స్ ఆప్టికల్-క్వాలిటీ 12ఎంపీ టెలిఫోటో షాట్‌లను క్యాప్చర్ చేయగలదు. టెలిఫోటో లెన్స్ ఎఫ్/2.8 ఎపర్చరుతో 12ఎంపీ వద్ద అలాగే ఉంటుంది.

ఐఫోన్ ప్రో మోడల్స్‌లో కీలకమైన అప్‌గ్రేడ్ అల్ట్రా-వైడ్ లెన్స్. పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీతో 48ఎంపీ వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఫుల్-రిజల్యూషన్, క్వాడ్-పిక్సెల్ మోడ్‌ల మధ్య మారవచ్చు. తద్వారా తక్కువ కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. అంతేకాదు.. పోస్ట్-ప్రాసెసింగ్‌లో 48ఎంపీ (ProRaw) కెమెరాను చేర్చాలని కూడా పుకార్లు సూచిస్తున్నాయి.

కొత్త క్యాప్చర్ బటన్ ఫీచర్ :
మొత్తం ఐఫోన్ 16 సిరీస్‌లో ఊహించిన మరో అద్భుతమైన ఫీచర్ కొత్త క్యాప్చర్ బటన్‌. ఈ డెడికెటేడ్ బటన్ యూజర్లకు ఫొటోగ్రఫీ అనుభవంపై మరింత కంట్రోల్ అందిస్తుంది. ఫొటోలు తీస్తున్నప్పుడు ఫోకస్ చేసేందుకు, లెవల్స్ జూమ్ చేయడానికి అడ్జెస్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫోన్ బాటమ్ రైట్ కార్నర్‌లో ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫోన్‌ను పట్టుకున్నప్పుడు క్యాప్చర్ బటన్ సహజంగా యూజర్ వేలితో సమానంగా ఉంటుంది. ఈ బటన్ లాక్ స్క్రీన్ నుంచి ఆన్-స్క్రీన్ కెమెరా షార్ట్‌కట్‌ను రీప్లేస్ చేయొచ్చు. ఫొటోగ్రఫీకి మరింత క్లియర్, ఫిజికల్ కంట్రోలింగ్ అందిస్తుంది.

48ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 5ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు, ఐఫోన్ 15 ప్రో 12ఎంపీ అల్ట్రా-వైడ్, 3ఎక్స్ టెలిఫోటో లెన్స్‌లతో పోలిస్తే గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందించనుంది.

Read Also : Vivo Y37 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో Y37 ప్రో ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!