Mahindra Thar reaches 1,00,000 units production milestone
Mahindra Thar : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (Mahindra & Mahindra Limited) కంపెనీ థార్ SUV ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ థార్ SUV ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి 2.5 ఏళ్లలోపు ఈ మైలురాయిని సాధించినట్టు తెలిపింది. కొన్ని నెలల క్రితమే మహీంద్రా థార్ RWDని వినియోగదారులకు మరింత అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్రకటనపై M&M లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆటోమోటివ్ డివిజన్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. ‘మహీంద్రా థార్ లక్ష యూనిట్లతో మైలురాయిని చేరుకున్నందుకు చాలా గర్వపడుతున్నాము. అడ్వెంచర్ ఆసక్తిగల వినియోగదారులను థార్ SUV మరింత ఆకట్టుకుంది. థార్ హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ నుంచి స్వేచ్ఛ, అభిరుచితో పాటు SUVకి ఐకాన్‌గా మారింది.
అడ్వెంచర్ వంటి ప్రయాణాల్లో క్యాంపింగ్ అడ్వెంచర్ అయినా లేదా వారాంతపు సెలవులైనా కావచ్చు. కస్టమర్‌లు థార్ పట్ల నమ్మకం, ప్రేమకు కృతజ్ఞతలు. వినియోగదారులకు ప్రతిరోజూ అసాధారణమైన అనుభవాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని పేర్కొన్నారు.
Mahindra Thar reaches 1,00,000 units production milestone
మహీంద్రా థార్ 4×4, RWD వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో డీజిల్, పెట్రోల్ మోటార్లు రెండింటికీ ఆప్షన్ ఉంటుంది. ఇంజన్ ఆప్షన్‌లలో 116bhp 1.5-లీటర్ డీజిల్, 130bhp తో 2.2-లీటర్ డీజిల్, 150bhp తో 2.0-లీటర్ పెట్రోల్ ఉన్నాయి. 1.5-లీటర్ డీజిల్ RWD వేరియంట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.
పెట్రోల్ 4×4, RWD వేరియంట్‌లకు అందుబాటులో ఉంది. థార్ SUV ధరలు AX ఆప్షనల్ డీజిల్ RWD రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో LX డీజిల్ 4×4 ధర రూ. 16.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.