Maruti Suzuki Alto K10 : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సరికొత్త Aulto K10 టూర్ H1 ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
Maruti Suzuki Alto K10 : మారుతి సుజుకి ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. టూర్ H1 మైలేజ్ పెట్రోల్ వేరియంట్‌కు 24.60 కిమీ/లీటర్, CNG వేరియంట్‌కు 34.46 కి.మీగా వస్తుంది.

Maruti Suzuki Alto K10-based Tour H1 commercial hatchback launched, price starts at Rs 4.80 lakh
Maruti Suzuki Alto K10 : భారత మార్కెట్లోకి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. ఈ మోడల్ ఆల్టో K10 (Aulto K10) ఆధారంగా టూర్ H1ని ప్రవేశపెట్టింది. ఈ మోడల్ రూ. 4.80 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, ఆర్కిటిక్ వైట్ కలిగి ఉంది. టూర్ H1 పవర్‌లో నెక్స్ట్-జెన్ K-సిరీస్ 1.0-లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్, పెట్రోల్ మోడ్‌లో 66.6PS, CNG మోడ్‌లో 56.6PS, పెట్రోల్ మోడ్‌లో 89Nm, CNGలో 82.1Nm అభివృద్ధి చేస్తుంది.
Read Also : Top 5 Smartphones 2023 : 2023లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవేనట.. గూగుల్ బార్డ్ ఏఐ టక్కున చెప్పేసింది..!
ఈ మోడ్ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మారుతి సుజుకి టూర్ H1 మైలేజ్ పెట్రోల్ వేరియంట్‌కు 24.60 కిమీ/లీటర్, CNG వేరియంట్‌కు 34.46 కిమీగా వస్తుంది. టూర్ H1 డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-టెన్షనర్ ఫోర్స్ లిమిటర్‌తో ముందు సీట్ బెల్ట్‌లు, ఫ్రంట్, బ్యాక్ ప్రయాణీకులకు సీట్ బెల్ట్ రిమైండర్‌లు, ఇంజన్ ఇమ్మొబిలైజర్, EBDతో కూడిన ABS, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది. వేరియంట్ వారీగా మారుతి సుజుకి టూర్ H1 ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ విధంగా ఉన్నాయి. అందులో టూర్ H1 పెట్రోల్ ధర రూ. 4.80 లక్షలు ఉంటే, టూర్ H1 CNG ధర రూ. 5.70 లక్షలుగా ఉంది.

Maruti Suzuki Alto K10-based Tour H1 commercial hatchback launched
అన్ని కొత్త టూర్ H1 కమర్షియల్ సెక్షన్‌లో ఆల్టో K10 వారసత్వం, నమ్మకాన్ని కలిగి ఉంది. విశ్వసనీయమైన నెక్స్ట్-జెన్ K10C ఇంజన్, ఆకట్టుకునే ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్‌తో పాటు సౌలభ్యం, సెక్యూరిటీ కలిగి ఉంటుంది. ఈ అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తూ.. టూర్ H1 కమర్షియల్ ఛానల్ కస్టమర్ల జీవితాల్లో అపారమైన ఆనందాన్ని అందించనుందని మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.