Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఇ విటారా.. 7 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాస్ ఫీచర్లు..!
Auto Expo 2025 : మారుతి ఇ విటారా కొత్త మోడల్ కారు. ఫీచర్ల గురించి కూడా కంపెనీ అనేక వివరాలను రివీల్ చేసింది.

Auto Expo 2025 : Maruti Suzuki e Vitara electric SUV
Auto Expo 2025 : ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి కాస్తా లేటుగానే ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ ఈరోజు (జనవరి 17) నుంచి ప్రారంభమైన భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అదే.. మారుతి ఇ విటారా (Maruti Suzuki e-Vitara) కొత్త మోడల్ కారు. ఈ కారు మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి కూడా కంపెనీ అనేక వివరాలను రివీల్ చేసింది. మారుతి సుజుకి విటారా ఎలక్ట్రిక్ అవతార్ కంపెనీ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పో 2025లో హీరో సంచలనం.. 4 కొత్త బైక్‌లు, 2 కొత్త స్కూటర్లు విడుదల!
మారుతి ఇ-విటారా ఫీచర్లు :
ఇంటీరియర్ విషయానికి వస్తే.. మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్‌తో పాటు, కస్టమర్‌లు ఈ కారులో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్ రైడ్ సీట్ల సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు డిజైనింగ్ విషయానికి వస్తే.. కంపెనీ ఈ వాహనాన్ని కొత్త ప్లాట్‌ఫారమ్ (Heartect-e)పై రెడీగా ఉంటుంది. మారుతి ఇ-విటారా 49kwh, 61kwh రెండు బ్యాటరీ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

Auto Expo 2025
ఈ కారులో ఎకో, నార్మల్, స్పోర్ట్ 3 డ్రైవింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉంటాయి. 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇ-వితారాలో కనిపిస్తాయి. 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
మారుతి సుజుకి-ఇ వితారా రేంజ్ :
49kWh బ్యాటరీ ఆప్షన్ డ్రైవింగ్ రేంజ్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే, 61kWh బ్యాటరీ వేరియంట్ 500 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని కచ్చితంగా తెలుసు.
మారుతి సుజుకి ఇ విటారా సేఫ్టీ ఫీచర్లు :
మారుతి సుజుకి విటారా ఎలక్ట్రిక్ అవతార్ వినియోగదారుల భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లతో అందిస్తుంది. ఇది కాకుండా, ప్రమాదం సమయంలో మోకాళ్లకు గాయం కాకుండా డ్రైవర్ సీటు కింద ఎయిర్‌బ్యాగ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. ఇది కాకుండా, భద్రత కోసం ఈ కారులో లెవల్ 2 అడాస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also : Vivo T3 Series : వివో T3 సిరీస్ ధర తగ్గిందోచ్.. కొత్త ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!