మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. లాంచ్‌ డేట్ ఖరారు.. రెడీగా ఉన్నారా?

ఈ-విటారా ధరలు రూ.17 లక్షల నుంచి రూ.22.5 లక్షల మధ్య ఉండొచ్చు.

మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. లాంచ్‌ డేట్ ఖరారు.. రెడీగా ఉన్నారా?

Updated On : April 26, 2025 / 9:51 PM IST

మారుతి సుజుకి కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా చెప్పింది. 49 kWh(సింగిల్-మోటార్, ఫ్రంట్-వీల్ డ్రైవ్, 142 bhp, 189 Nm టార్క్), 61 kWh బ్యాటరీ (సింగిల్-మోటార్ ఫ్రంట్-వీల్ డ్రైవ్, 172 bhp, 189 Nm లేదా డ్యూయల్-మోటార్ AllGrip-e AWD 184 bhp, 300 Nm) ఆప్షన్లతో ఈ కారు అందుబాటులో ఉండనుంది.

డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్లతో లభ్యం కానుంది. 7kW AC, 70kW DC ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఈ కారు లాంచ్ కానుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS లెవల్ 2 ఫీచర్లు, ESP వంటి ఆధునిక సాంకేతికతలతో దీన్ని తీసుకువస్తున్నారు.

పానోరామిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో దీన్ని లాంచ్ చేయనున్నారు. ఈ కారు గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో తయారవుతుంది. తయారీ చేసిన వాహనాల్లో సగం వరకు యూరప్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

ఈ-విటారా ధరలు రూ.17 లక్షల నుంచి రూ.22.5 లక్షల మధ్య ఉండొచ్చు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.1-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో ఇది లాంచ్ కానుంది. పోర్టబుల్ ఛార్జర్, యాప్-బేస్డ్‌ ఛార్జింగ్ స్లాట్ రిజర్వేషన్‌తో 7 kW AC, 70 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ తో దీన్ని తీసుకొస్తున్నారు. ట్రై-స్లాష్ LED DRLలు, కనెక్ట్ చేసిన LED టెయిల్‌ల్యాంప్‌లు, C-పిల్లర్ రియర్ డోర్ హ్యాండిల్స్, 18- లేదా 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో బాక్సీ SUV స్టైలింగ్ తో లాంచ్‌ చేస్తున్నారు.

మార్కెట్లో టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా EV, MG ZS EV, మహీంద్రా BE 6తో ఈ కారు పోటీ పడవచ్చు. ఈ-విటారాను మారుతి సుజుకి ప్రీమియం నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారు. ఈ-విటారా తర్వాత హస్ట్లర్ SUVని ప్రవేశపెట్టాలని మారుతి సుజుకి యోచిస్తోంది.