MG Windsor EV : ఫస్ట్ టైం డిస్కౌంట్.. ఈ ఎంజీ విండ్సర్ EV కారుపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ. 65వేల వరకు ఆదా.. ఎలాగంటే?

MG Windsor EV : భారతీయ ఎలక్ట్రిక్ కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అనేక ఆటోమొబైల్ కంపెనీలు కొత్త సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఎంజీ మోటార్స్ ఈ విభాగంలో ఎంజీ విండ్సర్ ఈవీపై భారీ తగ్గింపు అందిస్తోంది.

MG Windsor EV : ఫస్ట్ టైం డిస్కౌంట్.. ఈ ఎంజీ విండ్సర్ EV కారుపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ. 65వేల వరకు ఆదా.. ఎలాగంటే?

MG Windsor EV (Image Credit To Original Source)

Updated On : January 15, 2026 / 6:17 PM IST

MG Windsor EV : మీరు ఎలక్ట్రిక్ SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ స్టోరీ మీకోసమే.. వాస్తవానికి, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దాంతో చాలా ఆటోమొబైల్ కంపెనీలు కొత్త సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి వదులుతున్నాయి.

ఇప్పుడు ఎంజీ మోటార్స్ కూడా ఇదే ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ విండ్సర్ ఈవీని కూడా అందిస్తోంది. మీరు ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేస్తే.. వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఎంజీ విండ్సర్ ఈవీ ఏ వేరియంట్‌పై ఎంతమొత్తంలో డబ్బు ఆదా చేయొచ్చో వివరంగా తెలుసుకుందాం..

ఎంజీ విండ్సర్ ఈవీపై సేవింగ్ ఎలా? :
ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ విండ్సర్ ఈవీని అందిస్తోంది. 2026 జనవరిలో ఈ కారు కొనుగోలుపై భారీగా సేవింగ్ చేసుకోవచ్చు. ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.

MG Windsor EV (Image Credit To Original Source)

38kWhపై ఆఫర్ ఏంటి? :
రిపోర్టుల ప్రకారం.. ఈ కారు బేస్ మోడల్ 38kWh వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ నెలలో ఈ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. రూ. 65,000 ఆదా చేయవచ్చు. ఈ డిస్కౌంట్‌లో రూ. 30వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 10,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి.

Read Also : Central Employees : ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. ఇకపై ఒకే శాలరీ అకౌంటులో బ్యాంకింగ్, బీమా.. రూ. 2 కోట్ల వరకు కవరేజ్.. ఫుల్ ప్లాన్ వివరాలివే..!

53kWhపై ఆఫర్ ఏంటి?:
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో వేరియంట్ 53kWh బ్యాటరీతో వస్తుంది. ఈ నెలలో కంపెనీ ఈ వేరియంట్లపై రూ. 30వేల వరకు సేవింగ్ అందిస్తోంది. ఇందులో రూ.20వేల క్యాష్ డిస్కౌంట్ రూ. 10వేల కార్పొరేట్ బోనస్ ఉన్నాయి.

ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 12.65 లక్షలు (ఎక్స్-షోరూమ్). 38kWh వేరియంట్ ధర రూ. 17.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. ఎంజీ విండ్సర్ ప్రో వేరియంట్ ధర రూ. 18.73 లక్షల నుంచి రూ.19.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.