షియోమీకి పోటీగా : ఇండియాలో Moto E6s స్మార్ట్ ఫోన్

అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ రిలీజ్ కానున్నాయి.

  • Published By: sreehari ,Published On : September 16, 2019 / 07:23 AM IST
షియోమీకి పోటీగా : ఇండియాలో Moto E6s స్మార్ట్ ఫోన్

Updated On : September 16, 2019 / 7:23 AM IST

అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ రిలీజ్ కానున్నాయి.

అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ 16 (సోమవారం) మధ్యాహ్నాం 12 గంటలకు న్యూఢిల్లీలో Moto E6s స్మార్ట్ ఫోన్ తో పాటు కొత్త Smart TV కూడా లాంచ్ అయింది. స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను మోటరోలా కంపెనీ తమ యూట్యూబ్‌ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన IFA 2019 ఈవెంట్‌లో మోటో E6s స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 

ఇదివరకే ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మొబైల్ టీజర్ రిలీజ్ చేసింది. Flipkart ద్వారా Moto E6 సేల్ త్వరలో ప్రారంభం కానుంది. గతవారమే మోటరోలా లాంచింగ్ కు సంబంధించి ప్రెస్ ఇన్విటేషన్లను పంపింది. మోటో e6 ప్లస్‌ మోడల్ ను రీబ్రాండింగ్ చేసి Moto E6sగా ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. 

పాలిషిడ్ గ్రాఫైట్ అండ్ రిచ్ క్రాన్ బెర్రీతో మోటో E6s అందుబాటలోకి వచ్చింది. మోటో E6s మోడల్ ఫోన్ భారత మార్కెట్లలో ధర 111 డాలర్లు (రూ.7వేల 999)గా ఉంది. కాస్మిక్ బ్లూ వేరియంట్ ఫోన్ వచ్చే అక్టోబర్ నెలాఖరుకు మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు మోటో కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 23నుంచి ఫ్లిప్ కార్ట్ లో మోటో E6s స్మార్ట్ ఫోన్ సేల్స్ ప్రారంభం కానుంది. 

మోటో Smart TV : 
మోటరోలా E6s స్మార్ట్ ఫోన్‌తో పాటు ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాం ఆధారంగా పనిచేసే మోటరోలా Smart TVని కూడా లాంచ్ చేసింది. స్మార్ట్ టీవీతో పాటు 30W సౌండ్ బార్ (బుల్ట్ ఇన్) లాంచ్ చేసింది. MEMC టెక్నాలజీతో పాటు స్పోర్ట్ థిన్ బెజిల్స్ ఉన్నాయి. ఇండియాలో రిలీజ్ అయిన షియోమీ Mi TV 4 మోడల్స్ కు పోటీగా మోటరోలా స్మార్ట్ టీవీని రిలీజ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ లో సెప్టెంబర్ 29 నుంచి స్మార్ట్ టీవీ మోడల్స్ అందుబాటులో ఉంటాయి. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.1 అంగుళాల HD+ (720×1560 ఫిక్సల్స్) LCD డిస్‌ప్లే
* ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో P22 చిప్ సెట్ (PowerVR GE8320 GPU)
* 4GB ర్యామ్, 64GB (ROM) ఆన్ బోర్డు స్టోరేజీ
* మైక్రో SD కార్డు, 512GB ఎక్స్ ఫ్యాండబుల్
* ఆండ్రాయిడ్ 9 పై (OS)
* స్పోర్ట్స్ డ్యుయల్ రియర్ కెమెరా 
* 13MP ప్రైమరీ సెన్సార్, f/2.0 లెన్స్ 
* 2MP సెకండరీ డెప్త్ సెన్సార్ 
* 8MP సెల్ఫీ షూటర్, f/2.0 లెన్స్
* 3000mAh బ్యాటరీ
* రియర్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* బ్లూటూత్ 4.2, Wi-Fi
* FM రేడియో 
* పాలిషిడ్ గ్రాఫైట్ అండ్ రిచ్ క్రాన్ బెర్రీ