Moto G85 Sale
Moto G85 Sale : మదర్స్ డే రోజున మీ అమ్మకు ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, మీకోసం చౌకైన స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సాసా లే సేల్‌లో బడ్జెట్ రేంజ్ అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మోటోరోలా G85 ఫోన్ (Moto G85 Sale) కొనుగోలుపై డిస్కౌంట్లు, ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు, కొత్త ధర వివరాలివే :
ధర : 20999 (8GB ర్యామ్, 128GB స్టోరేజ్)
డిస్కౌంట్ : 23శాతం తగ్గింపు
ధర : 15,999
ఆఫర్లు :
అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. మీరు రూ. 15,450 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. మీరు నెలకు రూ. 2667 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా G85 5G ఫీచర్లు :
డిస్‌ప్లే : 6.67-అంగుళాల ఫుల్-HD ప్లస్ కర్వ్డ్ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz సపోర్టుతో రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది.
పర్ఫార్మెన్స్ : మల్టీ టాస్కింగ్ కోసం ఈ మోటోరోలా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6S జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది.
కెమెరా సెటప్ : కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 8MP ఉండగా, సెల్ఫీల కోసం 32MP కెమెరా కూడా ఉంది.
బ్యాటరీ : పవర్ కోసం ఈ ఫోన్ 33-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయవచ్చు.