ఇండియాలో లాంచ్ : Motorola ఆండ్రాయిడ్ LED TV వచ్చేసింది

Moto E6s స్మార్ట్ ఫోన్‌తో పాటు ఫస్ట్ LED ఆండ్రాయిడ్ Smart TV ఇండియన్ మార్కెట్లో Motorola కంపెనీ లాంచ్ చేసింది. దేశంలో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ కేటగిరీలపై పోటీ నెలకొన్న తరుణంలో మోటో ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో కొత్త గాడ్జెట్ల లైనప్‌తో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దేశ మార్కెట్లో 39శాతం మార్కెట్ షేర్ తో ప్రభంజనం సృష్టిస్తోన్న షియోమీకి పోటీగా మోటో కొత్త స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది.
మోటరోలా LED TV రేంజ్ బేసిక్ 32 అంగుళాల HD రెడీ TV నుంచి ప్రారంభమై 65అంగుళాల 4K యూనిట్ వరకు ఉన్నాయి. 43 అంగుళాల FHD మోడల్, 43 అంగుళాల UHD వేరియంట్, 50 అంగుళాల UHD వెర్షన్, 55 అంగుళాల UHD ఆప్షన్ ఇలా ఎన్నో వేరియంట్లు ఉన్నాయి.
స్టాక్ ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ ఫేస్ పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. HDR 10 కంటెంట్ కోసం Dolby విజన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. స్మార్ట్ టీవీ కిందిభాగంలో 20W-30W సౌండ్ బార్ (బుల్ట్ ఇన్) ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు (వేరియంట్ ఆధారంగా) మోడల్స్ ఉన్నాయి.
178 డిగ్రీల వ్యూ యాంగిల్స్ డిస్ ప్లే ఉన్నట్టు మోటో తెలిపింది. MEMC టెక్నాలజీతో పాటు స్పోర్ట్ థిన్ బెజిల్స్ ఉన్నాయి. ఇండియాలో రిలీజ్ అయిన షియోమీ Mi TV 4 మోడల్స్ కు పోటీగా మోటరోలా స్మార్ట్ టీవీని రిలీజ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ లో సెప్టెంబర్ 29 నుంచి స్మార్ట్ టీవీ మోడల్స్ అందుబాటులో ఉంటాయి.
స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* క్వాడ్ కోర్ మీడియా టెక్ చిప్ సెట్ (Mali GPU)
* 2.25GB ర్యామ్, 16GB స్టోరేజీ
* ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్
* గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్
* డిఫాల్ట్ OTT సర్వీసు సపోర్ట్
* క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ (in-built)
* వాయిస్ కంట్రోల్స్ గూగుల్ అసిస్టెంట్
* ప్లే స్టోర్, యూట్యూబ్, నెట్ ఫ్లెక్స్ బటన్స్ ఆన్ ప్లాస్టిక్ రిమోట్
* బ్లూటూత్ ఎనేబుల్డ్ డబుల్ జాయ్ స్టిక్ గేమ్ ప్యాడ్
మోటరోలా Smart TV మోడల్స్ ధరలు ఇవే :
* 43-inch HDR TV: Rs 13,999
* 43-inch FHD TV: Rs 24,999
* 43-inch UHD (4K) TV: Rs 29,999
* 50-inch UHD (4K) TV: Rs 33,999
* 55-inch UHD (4K) TV: Rs 39,999
* 65-inch UHD (4K) TV: Rs 64,999