Motorola Android 14 Update : మోటోరోలా ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ పొందే ఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!
Motorola Android 14 Update : మోటోరోలా ఎట్టకేలకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అప్‌డేట్‌ను పొందడానికి అర్హత పొందిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Motorola reveals list of phones that will get Android 14 update
Motorola Android 14 Update : ప్రముఖ లెనోవో యాజమాన్యంలోని బ్రాండ్ మోటోరోలా అతి త్వరలో సరికొత్త ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ రిలీజ్ చేయనుంది. రాబోయే కొత్త ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ని అందుకునే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను కంపెనీ వెల్లడించింది.
అక్టోబర్ 2023లో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్ ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను రిలీజ్ చేసిన తర్వాత శాంసంగ్, షావోమీ, ఒప్పో, వన్‌ప్లస్‌తో సహా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోని ప్రధాన తయారీదారులు ఇప్పటికే ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌లను ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క ఓఎస్ అప్‌డేట్ వారి సంబంధిత స్కిన్‌లతో కస్టమైజ్ అయ్యాయి. ఇప్పుడు, మోటోరోలా తమ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్స్ ఆధారంగా మై యూఎక్స్ ద్వారా రిలీజ్ చేయనుంది.
Read Also : Honor X9b India Launch : భారత్‌కు హానర్ X9b వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్‌లు లీక్..!
మోటోరోలా సపోర్ట్ పేజీలో ఫోన్ల జాబితా :
ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌కు అర్హత ఉన్న నిర్దిష్ట స్మార్ట్‌ఫోన్‌ల ధృవీకరణపై మోటోరోలా మొదట్లో మానుకున్నప్పటికీ, కంపెనీ ఇప్పుడు (MyUX) లేటెస్ట్ అప్‌డేట్ అందుకోవడానికి నిర్ణయించిన డివైజ్ సమగ్ర జాబితాతో సపోర్టు పేజీని అప్‌డేట్ చేసింది. అయితే, సపోర్ట్ పేజీ అప్‌డేట్ విడుదల కచ్చితమైన టైమ్‌లైన్‌ను కంపెనీ వెల్లడించలేదు. మోటోరోలా పార్టనర్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అప్‌డేట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆండ్రాయిడ్ 14 పొందే స్మార్ట్‌ఫోన్లు ఇవే :
భారతీయ యూజర్ల కోసం మోటరోలా ఇప్పటికే ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్స్‌పై బీటా టెస్టింగ్ ట్రయల్స్ ప్రారంభించింది. భారత మార్కెట్లో మోటో జీ54 5జీ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే ఆండ్రాయిడ్ 14 బీటా అప్‌డేట్‌ను అందుకుంది. ఇందులో డిసెంబర్ 2023 సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. కొత్త వెర్షన్ నంబర్ (U1TD34.68)ని కలిగి ఉంది. భారత్‌లో ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కోసం అర్హత పొందిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ప్రముఖ మోడల్‌లు కూడా ఉన్నాయి.

Motorola Android 14 update
మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, రెజర్ 40, ఎడ్జ్ సిరీస్ ఫోన్‌లు (మోటో ఎడ్జ్ 40 నియో, ఎడ్జ్ 40, ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 ఫ్యూజర్, ఎడ్జ్ 30తో సహా) మోటో జీ84 5జీ, మోటో జీ54 వంటి డివైజ్‌లు, మోటో జీ73 5జీ, మోటో జీ13, మోటో జీ14, మోటో జీ53 అన్నీ సరికొత్త ఆండ్రాయిడ్ 14OS ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
మోటోరోలా సపోర్టు పేజీలో నిర్దిష్ట అప్‌డేట్ సమయాలను అందించనప్పటికీ వినియోగదారులు ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్స్ హోరిజోన్‌లో పొందవచ్చు. ప్రస్తుత పోటీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసేందుకు విభిన్న శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లకు సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించనున్నట్టు కంపెనీ చెబుతోంది. దీనికి సంబంధించి ఆమోదాన్ని పొందేందుకు మోటోరోలా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. వినియోగదారులు ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ ద్వారా డివైజ్‌లకు అందించే మెరుగైన ఫీచర్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : Moto G54 5G Price : భారత్‌లో మోటో జీ54 5జీ ధర భారీగా తగ్గిందోచ్.. కొత్త ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!