Moto G54 5G Price : భారత్‌లో మోటో జీ54 5జీ ధర భారీగా తగ్గిందోచ్.. కొత్త ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Moto G54 5G Price : మోటో జీ54 5జీ ఫోన్ ధర తగ్గింది. ఏకంగా రూ.3వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. తగ్గింపు తర్వాత ఈ మోటో 5జీ ఫోన్ ధర ఎంతంటే? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Moto G54 5G Price in India Discounted
Moto G54 5G Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన మోటో జీ54 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,999 ఉండగా.. ఇప్పుడు, కంపెనీ మోటో జీ-సిరీస్ హ్యాండ్‌సెట్ ధరను రూ.3వేల వరకు తగ్గించింది. మోటో జీ54 5జీ ఫోన్ 120హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో రన్ అవుతుంది. దాంతో పాటు గరిష్టంగా 12జీబీ ర్యామ్ గరిష్టంగా 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంటుంది. మోటో జీ54 5జీ ఫోన్ 50ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు కూడా అందిస్తుంది.
భారత మార్కెట్లో మోటో జీ54 5జీ ధర ఎంతంటే? :
గతేడాది సెప్టెంబర్‌లో మోటో జీ54 5జీ ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ కోసం రూ. 18,999కు లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఈ హ్యాండ్‌సెట్ మోటరోలా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్‌లకు వరుసగా రూ. 13,999, రూ.15,999 నుంచి అందుబాటులో ఉన్నాయి.

Moto G54 5G Price Discounted
మోటో జీ54 5జీ స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) మోటో జీ54 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో (My UX 5.0)తో రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 12జీబీ వరకు ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ద్వారా నిర్వహించవచ్చు.
మోటో జీ54 5జీ ఫోన్ 256జీబీ వరకు ఉన్న ఆన్‌బోర్డ్ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఐపీ52-రేటెడ్ వాటర్-రిపెల్లెంట్ బిల్డ్‌ను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 33డబ్ల్యూ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
Read Also : Honor X9b India Launch : భారత్‌కు హానర్ X9b వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్‌లు లీక్..!