Honor X9b India Launch : భారత్‌కు హానర్ X9b వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్‌లు లీక్..!

Honor X9b India Launch : హానర్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందుగానే హానర్ X9b మోడల్ ధర, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Honor X9b India Launch : భారత్‌కు హానర్ X9b వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్‌లు లీక్..!

Honor X9b India Launch Date, Price, Specifications Leaked

Updated On : January 23, 2024 / 4:07 PM IST

Honor X9b India Launch : భారత మార్కెట్లోకి హానర్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. అదే.. హానర్ (Honor X9b) మోడల్.. హెచ్‌టెక్ అధికారికంగా లాంచ్ తేదీని ధృవీకరించలేదు. అయితే, లేటెస్ట్ లీక్ రెండో వారంలో హ్యాండ్‌సెట్ దేశంలో అధికారికంగా లాంచ్ కానుందని సూచిస్తుంది. హానర్ X9b భారతీయ వేరియంట్ ధర వివరాలు, స్పెసిఫికేషన్‌లు లీకయ్యాయి.

Read Also : Apple iPad Air Launch : ఆపిల్ అతిపెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలివే

ధర వివరాలు (అంచనా) :
హానర్ ఎక్స్9బీ ఫోన్ రూ. 30వేల ధర విభాగంలో వస్తుందని భావిస్తున్నారు. గత ఏడాదిలో ఎంపిక చేసిన అరబ్ దేశాలలో హానర్ ఎక్స్9బీని ఆవిష్కరించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 108ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 35డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,800ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

హానర్ X9b లాంచ్ డేట్ ఎప్పుడంటే? :
టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ప్రకారం.. హానర్ ఎక్స్9బీ భారత్ లాంచ్ తేదీ, ధర వివరాలను లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ ఫిబ్రవరి 8 లేదా ఫిబ్రవరి 9న దేశంలో లాంచ్ కానుంది. దీని ధర రూ. 25వేల నుంచి రూ. 30వేల మధ్య ఉండనుంది. ఈ సేల్ ఆఫర్లు ధర రూ. 23,999 నుంచి ఉండవచ్చు.

Honor X9b India Launch Date, Price, Specifications Leaked

Honor X9b India Launch Date, Price Leaked

హానర్ ఎక్స్9బీ మోడల్ హానర్ చాయిస్ ఎక్స్5 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) బండిల్ రూ. 35వేల లోపు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హానర్ ఎక్స్9బీ మోడల్ భారతీయ వేరియంట్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా (MagicOS) 7.2తో వస్తుంది. స్పాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఈసీతో 12జీబీ ర్యామ్‌తో రన్ అవుతుంది.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
హానర్ ఎక్స్9బీ ఫోన్ ఇప్పటికే యూఏఈలో 8జీబీ ర్యామ్ + 256జీబీ, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్OS 7.2పై రన్ అవుతుంది. 6.78-అంగుళాల 1.5కె (1,200×2,652) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. దీంతో పాటు గరిష్టంగా 12జీబీ ర్యామ్ కూడా ఉండనుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హానర్ ఎక్స్9బీ మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 35డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,800ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!