Mukesh Ambani : రిలయన్స్ 45వ వార్షిక సమావేశం..వర్చువల్ రియాల్టీ ఫ్లాట్ ఫాంపై ముఖేశ్ అంబానీ ప్రసంగం
రిలయన్స్ AGM మొదలయింది. వర్చువల్ రియాల్టీ ప్లాట్‌ఫాంతో పాటు ప్రత్యక్ష ప్రసారంలోనూ AGM నిర్వహిస్తున్న కంపెనీల్లో రిలయన్స్ ముందువరుసలో ఉంది. ముఖేశ్ అంబానీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి మెటావర్స్ టెక్నాలజీతో వర్చువల్ విధానంలో ప్రసంగించారు.

Mukesh Ambani
Mukesh Ambani : రిలయన్స్ AGM మొదలయింది. వర్చువల్ రియాల్టీ ప్లాట్‌ఫాంతో పాటు ప్రత్యక్ష ప్రసారంలోనూ AGM నిర్వహిస్తున్న కంపెనీల్లో రిలయన్స్ ముందువరుసలో ఉంది. ముఖేశ్ అంబానీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి మెటావర్స్ టెక్నాలజీతో వర్చువల్ విధానంలో ప్రసంగించారు. 5G సేవలు, టెలికమ్యూనికేషన్ విస్తరణ ప్రణాళికలు, రీటైల్ యూనిట్స్, పిల్లలకు బాధ్యతల పంపకంపై AGMలో ముఖేశ్ అంబానీ కీలక వివరాలు వెల్లడించనున్నారు.
జూన్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా ముకేశ్ తప్పుకుని పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు AGMలో అనంత్ అంబానీ, ఆశా అంబానీతో పాటు నీతా అంబానీకి అప్పగించబోయే బాధ్యతలపై ముకేశ్ అంబానీ ప్రకటన చేస్తారని వార్తలొస్తున్నాయి.
Mukesh Ambani : ముఖేశ్ అంబానీ వారసుల చేతుల్లోకి రిలయన్స్ సంస్థలు..RIL మరింత పరుగులు పెట్టబోతోందా ?
ముకేశ్ అంబానీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభం, అదానీ తక్షణ సవాళ్లని మార్కెట్ నిపుణులంటున్నారు. ముఖ్యంగా ఈ AGMలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం 5G. ఇప్పటికే జియో 5G ట్రయల్స్ నిర్వహించింది. 6Gపై పరిశోధనలు చేస్తున్న ఫిన్‌లాండ్‌కు చెందిన ఔలు కంపెనీతో 5G సేవలపై జియో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. జియో అతి త్వరలో 5G సేవలు అందుబాటులోకి తేనుంది.