Bajaj Chetak e-Scooter : కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఈ నెల 20న భారత్‌‌లో లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Bajaj Chetak electric Scooter : భారత మార్కెట్లో బజాజ్ ఆటో ఇప్పటివరకు 3 లక్షల యూనిట్లకు పైగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించింది.

Bajaj Chetak e-Scooter : కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఈ నెల 20న భారత్‌‌లో లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

New Bajaj Chetak electric scooter launch

Updated On : December 7, 2024 / 9:25 PM IST

Bajaj Chetak electric Scooter : ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో డిసెంబర్ 20, 2024న కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. ప్రారంభంలో జనవరి 14, 2020న భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

బజాజ్ చేతక్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటి. ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) డేటా ప్రకారం.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 లక్షల యూనిట్లు ఇప్పటివరకు విక్రయించబడ్డాయి.

బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఏథర్ రిజ్టా వంటి వాటికి పోటీదారుగా ఉంది. నివేదికల ప్రకారం.. కొత్త బజాజ్ చేతక్‌లో ఫ్లోర్‌బోర్డ్ కింద ఉంచిన బ్యాటరీ ప్యాక్‌తో కూడిన లేటెస్ట్ ఛాసిస్ ఉంటుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బిగ్ బూట్ కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం, బజాజ్ చేతక్ రెండు బ్యాటరీ (2.88kWh, 3.2kWh) ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. కొత్త మోడల్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను చూడవచ్చు.

ప్రస్తుతం క్లెయిమ్ చేసిన బజాజ్ చేతక్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఆధారంగా ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. 123కిమీ నుంచి 137కి.మీ వరకు ఉంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో పరిధి పెరుగుతుందని భావిస్తున్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95,998 నుంచి ప్రారంభమై రూ. 1,28,744 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) వరకు ఉంది. కొత్త మోడల్ ధర మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Infosys Narayana Murthy : బెంగళూరులో రూ. 50 కోట్ల విలసవంతమైన అపార్ట్‌మెంట్ కొనేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి