New Digital ID : త్వరలో మీ ఇంటికి డిజిటల్ ఐడీ.. అచ్చం ఆధార్ కార్డులాగే డీజీపిన్.. ఇకపై లొకేషన్ ఐడెంటిటీ వెరీ ఈజీ..!

New Digital ID : అతి త్వరలో ప్రతి ఇంటికి డిజిటల్ ఐడీ అందుబాటులోకి రానుంది. ఆధార్ కార్డు మాదిరిగానే డిజిపిన్ అందించనుంది.

New Digital ID : త్వరలో మీ ఇంటికి డిజిటల్ ఐడీ.. అచ్చం ఆధార్ కార్డులాగే డీజీపిన్.. ఇకపై లొకేషన్ ఐడెంటిటీ వెరీ ఈజీ..!

Updated On : May 29, 2025 / 8:59 PM IST

New Digital ID : డిజిటల్ ఇండియా దిశగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఉన్నట్టే ఇకపై ప్రతి ఇంటికి, షాపుకు డిజిటల్ అడ్రస్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ఆధార్ ఐడెంటిటీ మాదిరిగానే ప్రతి ఇంటికి ప్రత్యేకమైన యూనిక్ డిజిటల్ పిన్ రాబోతుంది.

ఈ కొత్త అడ్రస్ ఆధార్ సిస్టమ్ తీసుకురావాలని కేంద్ర భావిస్తోంది. ఇళ్లతో పాటు స్థలాలను సులభంగా గుర్తించేందుకు లొకేషన్ ఆధారిత డిజిటల్ ఐడీని అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also : Nothing Phone 2 : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ డోంట్ మిస్..!

ప్రధానంగా ఆన్‌లైన్ షాపింగ్ ప్యాకేజీలు, ఫుడ్‌ ఆర్డర్‌లను డెలివరీతో పాటు ప్రభుత్వ సేవలను వేగంగా అందించవచ్చు. భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) ఎకోసిస్టమ్‌లో ఫిజికల్ అడ్రస్ లింక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం, భారత్‌లో అడ్రస్ డేటా కోసం ప్రామాణిక వ్యవస్థ అందుబాటులో లేదు. దాంతో వినియోగదారుల ప్రైవసీకి ఇబ్బందికరంగా మారింది. ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు తరచుగా వ్యక్తిగత అడ్రస్ వివరాలను సేకరించి, అనుమతి లేకుండా షేర్ చేస్తుంటాయి. ఇకపై అలా కుదరదు. కొత్త డిజిటల పిన్ ద్వారా అడ్రస్ వివరాలను వినియోగదారుల అనుమతితో మాత్రమే షేర్ చేయడానికి వీలుంటుంది.

ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సర్వీసులకు కచ్చితమైన, ప్రామాణిక అడ్రస్ కలిగి ఉండాలి. అయితే, చాలావరకు ఇంటి, షాపు అడ్రస్‌లు అసంపూర్ణంగా ఉన్నాయి. దాంతో లొకేషన్ ఆధారిత సర్వీసులు తరచుగా సమీపంలోని ల్యాండ్‌మార్క్‌లపై ఆధారపడాల్సి వస్తుంది.

ఈ స్పష్టత లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఏటా 10 డాలర్ల నుంచి 14 బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది. అధిక జాప్యాలు కలగడం, తప్పుగా డెలివరీలు, లాజిస్టికల్ అస్థిరత కారణంగా జాతీయ GDPపై కూడా భారీగా ప్రభావం పడుతుంది.

కేంద్రం ఆలోచన ఇదే :
ప్రతిపాదిత ‘డిజిటల్ అడ్రస్ సిస్టమ్’ ద్వారా ఇంటి అడ్రస్ ఎలా ఉండాలి. డిజిటల్‌గా ఎలా స్టోర్ చేయాలి? సేఫ్‌గా ఎలా యాక్సెస్ చేయాలి అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సమాచారం ఉన్న వినియోగదారుల సమ్మతితో మాత్రమే అడ్రస్ డేటాను యాక్సెస్ చేయొచ్చు. ప్రైవసీ పరంగా ప్రోటోకాల్‌ కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టును పీఎం కార్యాలయం దగ్గరి పర్యవేక్షణలో పోస్టల్ శాఖ నిర్వహిస్తోందని నివేదిక పేర్కొంది.

దీనిపై ప్రజాభిప్రాయల కోసం త్వరలో ముసాయిదా విధానాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి తుది అమలు జరిగే అవకాశం ఉంది.

ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read Also : Lava Bold N1 Launch : లావా బోల్డ్ N1 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..

డిజిటల్ అడ్రస్ ఏంటి? :
డిజిటల్ అడ్రస్ అనేది DIGIPIN (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్‌ల ఆధారంగా ప్రత్యేకమైన 10-అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ కోడ్.

పిన్ కోడ్‌ల మాదిరిగా కాకుండా, DIGIPIN అనేది ఆధార్ యూనిక్ ఐడీ మాదిరిగా గృహాలు లేదా వ్యాపారాలకు కచ్చితమైన డేటాను అందిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక స్థావరాలను గుర్తించడంలో సాయపడుతుంది.