ATMల్లో కొత్త సాఫ్ట్ వేర్ : డబ్బు తీయటానికి కొత్త విధానం

ఏదైన బ్యాంకులో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేశారా? మీరు విత్ డ్రా చేసిన సమయంలో ఏటీఎం ప్రాసెస్ లో ఎలాంటి మార్పునైనా గమనించారా? లేదంటే.. ఈసారి ఏటీఎంకు వెళ్లినప్పుడు గమనించండి.

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 10:04 AM IST
ATMల్లో కొత్త సాఫ్ట్ వేర్ : డబ్బు తీయటానికి కొత్త విధానం

Updated On : January 31, 2019 / 10:04 AM IST

ఏదైన బ్యాంకులో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేశారా? మీరు విత్ డ్రా చేసిన సమయంలో ఏటీఎం ప్రాసెస్ లో ఎలాంటి మార్పునైనా గమనించారా? లేదంటే.. ఈసారి ఏటీఎంకు వెళ్లినప్పుడు గమనించండి.

ఇటీవల ఏదైన ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేశారా? మీరు విత్ డ్రా చేసిన సమయంలో ఏటీఎం ప్రాసెస్ లో ఎలాంటి మార్పునైనా గమనించారా? లేదంటే.. ఈసారి ఏటీఎంకు వెళ్లినప్పుడు గమనించండి. ఇప్పటివరకూ ఉన్న ఏటీఎంల్లో విత్ డ్రా ప్రాసెస్ మారిపోయింది. అవును. మీరు విన్నది, చదివింది నిజమే. ఆ మార్పుకు కారణం ఏదో కాదు. కొత్త సాఫ్ట్ వేర్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఏటీఎంలో ఈ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసేస్తున్నారు. ఇటవీల కొన్ని గ్యాంగులు ఏటీఎంలపై కన్నేసి దొంగతనాలు, కార్డు క్లోనింగ్స్ ఫ్రాడ్స్ వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయక తప్పని పరిస్థితి.ఇదే అదునుగా భావించిన కొన్ని గ్యాంగులు.. కార్డుదారుల కళ్లుగప్పి కార్డు క్లోనింగ్స్ లకు పాల్పడి అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్నారు.

చోరీలకు చెక్..
ఏటీఎంలో చోరీలకు అడ్డుకట్ట వేసిందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు కొన్ని సూచనలు చేసింది. ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు అందించిన మ్యాగ్నిటిక్ డెబిట్ కార్డుల స్థానంలో తప్పనిసరిగా చిప్ కార్డులు రీప్లెస్ చేయాలని, ఏటీఎంలో కూడా తప్పనిసరిగా జనవరి 30,2019 నాటికి కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాల్సిందిగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులన్నీ ఒక్కదానికి తరువాత మరొకటి తమ ఏటీఎంల్లో కొత్త సాఫ్ట్ వేర్ తో అప్ డేట్ చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఏటీఎంలలో ఈ కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయింది. త్వరలో మిగతా బ్యాంకుల ఏటీఎంల్లో కూడా ఈ తరహా సాఫ్ట్ వేర్ అప్ డేట్ కానుంది. 

స్వైప్ అక్కర్లేదు.. ఇన్ సర్ట్ చేస్తే చాలు..
మీకు డబ్బులు కావాలి. ఏం చేస్తారు.. వెంటనే దగ్గరలోని ఏదైనా బ్యాంకు ఏటీఎం దగ్గరకు వెళ్తారు. ఆ ఏటీఎం నుంచి మీ డెబిట్ కార్డుతో మనీ విత్ డ్రా చేస్తారు. అంతేగా. ముందుగా మీరే చేస్తారు. మీ కార్డును స్వైప్ చేస్తారు. విత్ డ్రా ప్రాసెస్ స్టార్ అవుతుంది. అమౌంట్, పిన్ ఎంటర్ చేస్తారు. డబ్బులు తీసేసుకుంటారు. ఆ తొందరలో ఒక్కోసారి మీ కార్డును అక్కడే మరిచి వెళ్లిపోతారు. ఇకపై ఇలా జరగదు. ఇప్పుడు వచ్చిన కొత్త సాఫ్ట్ వేర్ తో స్వైప్ చేయాల్సిన పనిలేదు.

 

మీ కార్డును ఏటీఎం చిప్ దగ్గర ఇన్ సర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అమౌంట్, పిన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఏటీఎంలో నుంచి మీ కార్డును తీసేయమని అడుగుతుంది. కార్డు ఏటీఎంలో నుంచి తీయగానే.. ట్రాన్స్ జెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ మనీ బయటకు వస్తుంది. అంటే.. ఏటీఎంలో ఇన్ సర్ట్ చేసిన కార్డు బయటికి తీస్తేనే మీ మనీ విత్ డ్రా అవుతుందనమాట. ఈ తరహా సాఫ్ట్ వేర్ ఉండటం వల్ల కార్డుదారులు తమ కార్డును ఏటీఎం లో పెట్టి మరిచిపోయే ప్రసక్తే ఉండదు.  

సాఫ్ట్ వేర్ అప్ డేట్.. ఒక్కో మెషీన్ కు రూ.5వేలు ఖర్చు  
ప్రస్తుతం నగరంలో 4వేల 560 (అన్ని బ్యాంకులతో కలిపి) ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 50 శాతం వరకు కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయింది. ప్రైవేట్ బ్యాంకుల ATM మిషన్లలో మాత్రం 90 శాతం వరకు కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ATM మిషన్లలో కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడానికి ఒక్కో ATM కు రూ.5వేలు ఖర్చు అయిందని వెల్లడించారు. ఈ సాఫ్ట్ వేర్ సాయంతో ATMలో కార్డు క్లోనింగ్స్ ఫ్రాడ్స్ జరగకుండా నియంత్రించవచ్చునని ప్రకటించారు.