NPS Vatsalya : ఈ ప్రభుత్వ పథకంలో కేవలం రూ. 1000 పెట్టుబడితో రూ. 2.3 కోట్లు సంపాదన.. ప్రతినెలా లక్ష పెన్షన్ పొందొచ్చు.. ఇదిగో ఇలా..!

NPS Vatsalya Scheme : ప్రభుత్వం పథకంలో రూ. 1000 పెట్టుబడి ద్వారా మీ పిల్లలకు 60ఏళ్ల వయస్సు వచ్చేసరికి 2.3 కోట్లు సంపాదించి పెట్టొచ్చు.. ప్రతినెలా లక్ష పెన్షన్ కూడా వస్తుంది.. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

NPS Vatsalya Scheme

NPS Vatsalya : ప్రస్తుత రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతోనే అసలు సమస్య. ఇప్పటినుంచి ఒక ప్లాన్ ప్రకారం సేవింగ్స్ చేసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను వాళ్లు ఎదుర్కోకూడదని భావిస్తారు. చాలామంది పిల్లల విద్య, వివాహం కోసం ఎంతో కొంత డబ్బును ఆదా చేస్తుంటారు.

కానీ, మీ పిల్లలు రిటైర్మెంట్ లైఫ్ కూడా చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం అందించే NPS వాత్సల్య పథకం సరైనదిగా చెప్పవచ్చు. ఈ పథకం కింద పిల్లల అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు రూ. 1000 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 60 ఏళ్ల వయస్సులో మీ బిడ్డకు 2.3 కోట్లు కూడబెడతారు. అంతేకాదు.. ప్రతి నెలా లక్ష పెన్షన్ కూడా పొందవచ్చు.

Read Also : iPhone 16 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై ఏకంగా రూ.16,500 డిస్కౌంట్.. ఇలా కొంటే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!

ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చుంటే? :
NPS వాత్సల్య అనేది ప్రభుత్వ పథకం.. ఈ పథకం ద్వారా పిల్లల కోసం ఒకేసారి రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్‌ను ఏర్పాటు చేయవచ్చు. తల్లిదండ్రులు 18 ఏళ్ల వయస్సు వరకు పిల్లల పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టవచ్చు.

ఇందులో పెట్టుబడికి కనీస పరిమితి రూ. 1000గా ఉంటుంది. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అకౌంట్ పిల్లల పేరు మీద ఓపెన్ చేయొచ్చు. అయితే, 18 ఏళ్ల వయస్సు వరకు ఖాతాను పిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు చూసుకుంటారు. 18 ఏళ్లు నిండిన తర్వాత పిల్లలే ఈ ఖాతాను స్వయంగా మేనేజ్ చేయొచ్చు.

లక్షాధికారి ఎలా అవుతారంటే? :
మీకు బాబు లేదా పాప పుట్టినప్పుడు NPS వాత్సల్య అకౌంట్ ఓపెన్ చేయాలి. 18 ఏళ్ల వయస్సు వరకు అందులో రూ. వెయ్యి పెట్టుబడి పెడితే.. మీ పిల్లలకు 19వ సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 1000 పెట్టుబడి పెడితే, 60 ఏళ్ల వరకు మొత్తం పెట్టుబడి రూ. 7,20,000 అవుతుంది. దీనిపై 10శాతం రాబడి అనుకుంటే.. అప్పుడు కేవలం వడ్డీగా రూ. 3,77,61,849 లభిస్తుంది. మొత్తం కార్పస్ రూ. 3,84,81,849 అవుతుంది.

రూ. 2.3 కోట్ల ఫండ్, రూ. లక్ష పెన్షన్ కూడా :
NPS మొత్తంలో కనీసం 40శాతం యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. మీ యాన్యుటీలో 40శాతం పెట్టుబడి పెడితే రూ. 1,53,92,740 యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. రూ. 2,30,89,109 రిటైర్మెంట్ ఫండ్‌గా పొందుతారు. యాన్యుటీ 8 శాతం రాబడిని ఇస్తే.. ప్రతి నెలా రూ. 1,02,618 పెన్షన్‌గా అందుతుంది.

అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? :
NPS వాత్సల్య అకౌంట్ పెద్ద బ్యాంకులు, ఇండియన్ పోస్ట్‌లో ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ నుంచి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నేరుగా నియంత్రిస్తుంది. ఈ ఖాతాను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసే వారు NPS ట్రస్ట్ eNPS ప్లాట్‌ఫామ్‌కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

18 ఏళ్ల వరకు పాక్షికంగా 3 సార్లు విత్‌డ్రా :
ఈ పథకంలో పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు మూడుసార్లు పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. అయితే, ఇందుకోసం NPS అకౌంట్ కనీసం 3 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. విద్య, నిర్దిష్ట వ్యాధి చికిత్స, వైకల్యం 75శాతం వరకు ఉంటే తల్లిదండ్రులు గరిష్టంగా 25శాతం డబ్బులను పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

Read Also : Jio Superhit Plan : జియో సూపర్ హిట్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ హైస్పీడ్ డేటా..!

18 ఏళ్ల వయస్సులో NPS క్లోజ్ చేయొచ్చు :
పిల్లలకి 18 ఏళ్లు నిండినప్పుడు NPS వాత్సల్య అకౌంట్ సాధారణ NPS అకౌంటుగా మారుస్తారు. ఈ సందర్భంలో పిల్లవాడు 3 నెలల్లోపు కొత్త KYC పూర్తి చేయాలి. చందాదారులు 18 ఏళ్ల వయస్సులో NPS నుంచి నిష్క్రమించవచ్చు. కానీ, షరతు ఏమిటంటే.. కనీసం 80శాతం కార్పస్‌ను యాన్యుటీలో తిరిగి పెట్టుబడి పెట్టాలి. అయితే, 20శాతం ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. మొత్తం రూ. 2.5 లక్షల కన్నా తక్కువ ఉంటే మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.