Jio Superhit Plan : జియో సూపర్ హిట్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ హైస్పీడ్ డేటా..!

Jio Superhit Plan : రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ. 895 ప్లాన్ ద్వారా 336 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది.

Jio Superhit Plan : జియో సూపర్ హిట్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ హైస్పీడ్ డేటా..!

Jio Superhit Plan

Updated On : May 3, 2025 / 11:26 AM IST

Jio Superhit Plan : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో అనేక రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అందులో రూ. 895 ప్లాన్ ఒకటి. 336 రోజులు అంటే.. 11 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ముఖ్యంగా జియోఫోన్ లేదా జియో భారత్ ఫోన్ వంటి ఫీచర్ ఫోన్లు వాడే యూజర్లకు బెస్ట్ అని చెప్పవచ్చు.

Read Also : iPhone 16 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై ఏకంగా రూ.16,500 డిస్కౌంట్.. ఇలా కొంటే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!

ఈ జియో ప్లాన్ ద్వారా యూజర్లు తమ సిమ్‌ను ఎక్కువ రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాదు.. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ డేటాను యాక్సస్ చేయొచ్చు. అయితే, మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే ఈ ప్లాన్ మీకు రాదు. ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

రూ. 895 ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? :
ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రతి 28 రోజులకు 50 SMS, 2GB డేటా పొందవచ్చు. 336 రోజుల్లో మొత్తం 24GB డేటా లభిస్తుంది. తక్కువ ఇంటర్నెట్ వాడే యూజర్లకు ఈ డేటా బెస్ట్. బ్రౌజింగ్, సోషల్ మీడియా, చాటింగ్, ఇమెయిల్స్ చెక్ చేసే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం లాంగ్ టైమ్ ప్లాన్ :
స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం జియో కొన్ని వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది.

రూ.3,999 ప్లాన్ :
వ్యాలిడిటీ : 365 రోజులు
డేటా : రోజుకు 2.5GB
కాలింగ్ : అన్‌లిమిటెడ్
SMS : రోజుకు 100
OTT : రెండు సబ్‌స్క్రిప్షన్‌లు

Read Also : PM Kisan : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది ఎప్పుడంటే? రూ. 2వేలు పడిదే ఈ రైతులకే.. మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి! 

రూ.3,599 ప్లాన్ :
వ్యాలిడిటీ : 365 రోజులు
డేటా : రోజుకు 2.5GB
కాలింగ్, SMS : ఎప్పటిలాగే
ఫ్యాన్‌కోడ్ OTT సబ్‌స్క్రిప్షన్ లేదు.

మీరు జియోఫోన్ లేదా భారత్ ఫోన్ వంటి ఫీచర్ ఫోన్‌లను వాడుతుంటే.. తక్కువ ధరకు లాంగ్ టైమ్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. రూ. 895 ప్లాన్ ద్వారా ఏడాది పొడవునా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా, స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం సరసమైన డేటా-ప్యాక్డ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.