Ola Record Sales : ఈవీ మార్కెట్లో ఓలా ఆధిపత్యం.. మేలో 35వేల యూనిట్లకుపైగా అమ్మకాలు.. ఇది కదా రికార్డు అంటే..!

Ola Record Sales : ఓలా ఎలక్ట్రిక్ 30శాతానికి పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. మే 2023లో సంవత్సరానికి 300 శాతం వృద్ధిని సాధించిందని కంపెనీ తెలిపింది.

Ola Record Sales : భారత అతిపెద్ద EV కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), మే 2023లో 35వేల యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది. గత నెలలో అత్యధికంగా నెలవారీ అమ్మకాలతో, ఓలా 30శాతానికి పైగా మార్కెట్ వాటాను దక్కించుకుంది. తద్వారా గత నెలలో ఓలా 300 శాతం వృద్ధిని సాధించింది. గత 3 త్రైమాసికాలుగా అమ్మకాల చార్ట్‌లలో ఓలా (#EndICEAge) నిలకడగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘నెల తర్వాత మా అమ్మకాలు విపరీతమైన వృద్ధిని సాధించాయి. ఓలా స్థిరంగా EV విప్లవానికి నాయకత్వం వహిస్తోంది’ అని ఆయన అన్నారు. జూన్ నుంచి ప్రొడక్టుల ధరలను స్వల్పంగా పెంచామని సీఈఓ అగర్వాల్ చెప్పారు. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ (Ola S1)ని భారత మార్కెట్లో అత్యుత్తమ EV ప్రతిపాదనగా మార్చామని అన్నారు.

Read Also : Dangerous Malware : ఆండ్రాయిడ్ యూజర్లకు రెడ్ అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే.. వెంటనే డిలీట్ చేసేయండి.. లేదంటే అంతే మరి..!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంతో పాటు ప్రయాణించే విధానాన్ని మార్చడమే లక్ష్యంగా ఓలా ఎలక్ట్రిక్ ముందుకు సాగుతోందని అన్నారు. దేశంలో EV విప్లవానికి ఓలా నాయకత్వాన్ని వహిస్తోందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం S1 దేశంలోని 2W విభాగంలో EV ప్రతిపాదనతో సవరించిన సబ్సిడీలు జూన్ నుంచి అమలులోకి వచ్చాయి. Ola S1 Pro ధర ఇప్పుడు రూ. 1,39,999, S1 (3KWh) ధర రూ. 1,29,999, S1 Air (3KWh) ధర రూ. 1,09,999గా ఉన్నాయి.

Ola achieves record sales of over 35,000 units in May

ఈవీ వాహనాలపై సబ్సిడీలు గణనీయంగా తగ్గినప్పటికీ, ఇంజినీరింగ్, ఇన్నోవేషన్‌పై ఓలా దృష్టి పెట్టడంతో ధర భారీగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు S1 ప్రో స్కూటర్ ప్రారంభ ధరకే రిటైల్ అవుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడంలో భాగంగా భారత్ అంతటా అనేక ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను (ECs) ఏర్పాటు చేస్తోంది. తద్వారా ఓలా తన ఆఫ్లైన్ ఉనికిని మరింతగా విస్తరిస్తోంది. ఓలా ఇటీవలే తన 600వ ECని ప్రారంభించింది. ఆగస్టు నాటికి ఈ (EC) సంఖ్యను వెయ్యికి చేర్చాలని భావిస్తోంది.

Read Also : MG Motor India Sales : మేలో అదరగొట్టిన ఎంజీ మోటార్ ఇండియా.. ఏకంగా 5006 యూనిట్ల విక్రయాలు..!

ట్రెండింగ్ వార్తలు