MG Motor India Sales : మేలో అదరగొట్టిన ఎంజీ మోటార్ ఇండియా.. ఏకంగా 5006 యూనిట్ల విక్రయాలు..!

MG Motor India Sales : ఎంజీ మోటార్ ఇండియా రికార్డు స్థాయిలో రిటైల్ సేల్స్ అదరగొట్టేసింది. ఒక్క మేలోనే ఏకంగా 5006 యూనిట్ల విక్రయాలతో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MG Motor India Sales : మేలో అదరగొట్టిన ఎంజీ మోటార్ ఇండియా.. ఏకంగా 5006 యూనిట్ల విక్రయాలు..!

MG Motor India reports sales of 5006 units for the month of May 2023

MG Motor India reports sales of 5006 units : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) కంపెనీ రిటైల్ అమ్మకాల జోరు కొనసాగుతోంది. మే 2023 నెలలో తన రిటైల్ అమ్మకాల గణాంకాలను ఎంజీ మోటార్ ప్రకటించింది. మొత్తం 5006 యూనిట్లతో రికార్డు స్థాయిలో విక్రయాలను సాధించింది. గత ఏడాది ఇదే నెల (YOY)తో పోలిస్తే.. 25శాతం వృద్ధిని కంపెనీ సాధించింది.

ఎంజీ మోటార్ తమ ప్రొడక్టులకు సంబంధించి కార్యాచరణ ద్వారా మార్కెట్లో కంపెనీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. అదే కస్టమర్ల నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ పెరిగేలా చేసింది. భారత మొట్టమొదటి ప్యూర్ -ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV అయిన ZS EV అమ్మకాలలో వృద్ధి సాధించగా.. ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన MG కామెట్ EV-స్మార్ట్ EVకి కూడా వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వచ్చింది.

Read Also : iQOO Neo 7 Launch : ఐక్యూ నియో 7 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు తెలుసా?

ఎంజీ గ్లోస్టర్ లెవల్-1 ప్రీమియం SUV :
తద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ పట్ల కూడా మరింత దృష్టిసారించేలా చేసింది. మే నెలాఖరులో, కంపెనీ ఎంజీ గ్లోస్టర్ భారత మొదటి అటానమస్ లెవల్-1 ప్రీమియం SUV ‘The Advance BLACKSTORM’ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న ఎంజీ మోటార్ ఇండియా తయారీ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,20,000 వాహనాలు కాగా.. 3వేల మంది ఉద్యోగులు ప్లాంటులో పనిచేస్తున్నారు. ఎంజీ మోటార్ ఇండియా తమ కంపెనీ వృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తూనే (Connected, Autonomous, Shared, and Electric) CASE మొబిలిటీ, అత్యాధునిక ఆటోమేకర్ ఆటోమొబైల్ సెగ్మెంట్‌లో తమ అనుభవాలను విస్తరించింది.

MG Motor India reports sales of 5006 units for the month of May 2023

MG Motor India reports sales of 5006 units for the month of May 2023

భారత మొట్టమొదటి ఇంటర్నెట్ SUV MG హెక్టర్, భారత మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV MG ZS EV, భారత మొదటి అటానమస్ (లెవల్ 1) ప్రీమియం SUV MG గ్లోస్టర్, భారత మొట్టమొదటి ఆస్టర్ SUVతో సహా భారత మార్కెట్లో అనేక మొట్టమొదటి SUV మోడళ్లను ఆవిష్కరించింది. అందులో AI అసిస్టెంట్, అటానమస్ (లెవల్ 2) టెక్నాలజీ, MG కామెట్ EV ది స్మార్ట్ అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్ మరెన్నో ఉన్నాయి.

Read Also : Dangerous Malware : ఆండ్రాయిడ్ యూజర్లకు రెడ్ అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే.. వెంటనే డిలీట్ చేసేయండి.. లేదంటే అంతే మరి..!