Dangerous Malware : ఆండ్రాయిడ్ యూజర్లకు రెడ్ అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే.. వెంటనే డిలీట్ చేసేయండి.. లేదంటే అంతే మరి..!

Dangerous Malware : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. SpinOk అనే కొత్త ట్రోజన్ మాల్వేర్ (Google Play Store)లోని 101 యాప్‌లలో గుర్తించారు. ఈ యాప్‌లలో మాల్వేర్ యాడ్ SDK మాదిరిగా ఉన్నట్టు కనిపిస్తుంది.

Dangerous Malware : ఆండ్రాయిడ్ యూజర్లకు రెడ్ అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే.. వెంటనే డిలీట్ చేసేయండి.. లేదంటే అంతే మరి..!

Dangerous Malware found in over 100 Android apps, uninstall these apps immediately from your phone

Dangerous Malware found in 100 Android Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు రెడ్ అలర్ట్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసేయండి. లేదంటే మీ విలువైన డేటాతో పాటు నగదును కోల్పోయే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్ ప్రపంచంలో మాల్వేర్ దాడులు అనేవి కొత్త కాదు. హ్యాకర్‌లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని పర్సనల్ డేటా, డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వెబ్‌లో కొత్త మాల్వేర్ సర్క్యులేట్ అవుతున్నట్లు అనేక నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

అయినప్పటికీ, ఈ మాల్వేర్ దాడులు వినియోగదారుల్లో మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఉదాహరణకు, గూగుల్ (Play Store)లో 100 కన్నా ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో (Google Play Store)లో డౌన్‌లోడ్ చేయడానికి 100 అప్లికేషన్‌లకు పైగా ‘SpinOK’ అనే కొత్త స్పైవేర్‌ను మాల్‌వేర్ కలిగి ఉన్నాయని డా. వెబ్‌లోని (BleepingComputer సహకారంతో) సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. ఇందులోఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ మాల్‌వేర్ యాప్‌లు 400 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయి.

ఈ ట్రోజన్ మాల్వేర్ ఒక యాడ్ SDK మాదిరిగా ఉందని, వినియోగదారులను ఆకర్షించడానికి రోజువారీ రివార్డ్‌లతో మినీగేమ్‌లను ప్లే చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే, డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మాల్వేర్ యూజర్ల డివైజ్‌లలో స్టోర్ చేసిన ప్రైవేట్ డేటాను దొంగిలించి, రిమోట్ సర్వర్‌కు పంపుతుంది. SpinOk మాడ్యూల్ మినీ-గేమ్‌లు, టాస్క్‌ల సిస్టమ్, గిఫ్ట్‌లు, రివార్డ్ డ్రాయింగ్‌ల సాయంతో యాప్‌లపై యూజర్ల ఆసక్తిని కొనసాగించేందుకు రూపొందించిందని డాక్టర్ వెబ్ నివేదిక వెల్లడించింది.

Read Also : Primebook 4G Laptop Review : ప్రైమ్‌బుక్ 4G ల్యాప్‌టాప్ రివ్యూ.. రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ ల్యాప్‌టాప్ ఇదిగో..!

మాల్‌వేర్ ఎఫెక్ట్ అయిన యాప్‌లు హానికరమైన కంటెంట్‌ను కొన్ని ఇప్పటికీ హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నాయని మరికొన్ని నిర్దిష్ట వెర్షన్‌లలో కలిగి ఉన్నాయని లేదా స్టోర్ నుంచి డిలీట్ చేసినట్టు నివేదిక వెల్లడించింది. అయితే, ఈ యాప్‌లు 421,290,300 సార్లు డౌన్‌లోడ్ అయ్యాయి. తద్వారా గణనీయమైన సంఖ్యలో ఆండ్రాయిడ్ యూజర్లను సైబర్ ముప్పుకు గురిచేస్తుంది. ఈ విషయంలో గూగుల్‌ను పరిశోధకులు హెచ్చరించినప్పటికీ.. వినియోగదారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా దూరంగా ఉండాలని కోరారు.

ట్రోజన్ మాల్వేర్ ఎఫెక్టడ్ యాప్‌లు :
డాక్టర్ వెబ్ నివేదిక (Android.Spy.SpinOk) ట్రోజన్ SDKతో ఇన్‌ఫెక్టెడ్ మొత్తం 101 యాప్‌ల పేర్లను కూడా వెల్లడించింది. ఈ మాల్వేర్‌ను కలిగిన యాప్ స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లను కలిగిన టాప్ 10 యాప్‌ల జాబితాను అందిస్తుంది.

Dangerous Malware found in over 100 Android apps, uninstall these apps immediately from your phone

Dangerous Malware found in over 100 Android apps, uninstall these apps immediately from your phone

Noizz : మ్యూజిక్‌తో వీడియో ఎడిటర్ (కనీసం 100,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
Zapya : ఫైల్ ట్రాన్స్‌ఫర్ , షేరింగ్ (కనీసం 100,000,000 ఇన్‌స్టాలేషన్‌లు; ట్రోజన్ మాడ్యూల్ వెర్షన్ 6.3.3 నుంచి వెర్షన్ 6.4లో ఉంది. ప్రస్తుత వెర్షన్ 6.4.1లో లేదు).
VFly: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ (కనీసం 50,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
MVBit : MV వీడియో స్టేటస్ మేకర్ (కనీసం 50,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
Biugo : వీడియో మేకర్ & వీడియో ఎడిటర్ (కనీసం 50,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
Crazy Drop : (కనీసం 10,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
Cashzine : డబ్బు రివార్డ్‌ను సంపాదించండి (కనీసం 10,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
Fizzo Novel : ఆఫ్‌లైన్‌లో చదవడం (కనీసం 10,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
CashEM : రివార్డ్‌లను పొందండి (కనీసం 5,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
Tick : వాచ్ టూ ఎర్నింగ్ (కనీసం 5,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
Android.Spy.SpinOk ట్రోజన్ మాల్వేర్ ద్వారా సోకిన Andorid యాప్‌ల ఫుల్ లిస్టు ఉంది.

గూగుల్ పరిశోధకులు ఈ రిపోర్టును నివేదించారు. గూగుల్ ప్లే నుంచి యాప్‌లు డిలీట్ చేసింది. అయినప్పటికీ, యూజర్లు ఈ యాప్‌లను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసి ఉంటే డిలీట్ చేయమని కోరుతోంది. అదనంగా, గూగుల్ యాప్ స్టోర్‌లో ఈ యాప్‌లను వినియోగించే ముందు సెక్యూరిటీ అప్‌డేట్‌లతో సహా Google Playని అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.

అలాగే, మీ డివైజ్‌ను హానికరమైన మాల్‌వేర్ల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం చాలా మంచిది. అదనంగా, ఈ అప్‌డేట్‌లలో బగ్ ఫిక్సింగ్, బగ్‌లు, క్రాష్‌ల వంటి ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించవచ్చు. మరింత సెక్యూరిటీ కోసం మీ డివైజ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేసుకోండి.

Read Also : iQOO Neo 7 Launch : ఐక్యూ నియో 7 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు తెలుసా?