Ola Experience Centres : హైదరాబాద్‌లో మరో 3 కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు.. దేశవ్యాప్తంగా ఒకేరోజున 50 సెంటర్లతో ఓలా రికార్డు..!

Ola experience centres : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దేశవ్యాప్తంగా తమ సర్వీసులను విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల (Ola Experience Centers)ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఒకేరోజున 50 ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది.

Ola Experience Centres : హైదరాబాద్‌లో మరో 3 కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు.. దేశవ్యాప్తంగా ఒకేరోజున 50 సెంటర్లతో ఓలా రికార్డు..!

Ola Electric experience centres in Hyderabad ( Photo : Google)

Updated On : April 4, 2023 / 11:41 PM IST

Ola Experience Centres : భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) కంపెనీ తమ వినియోగదారులకు సర్వీసులను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అంతటా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను (Ola Experience Centres) ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న (మంగళవారం) హైదరాబాద్ నగరంలో మరో 3 కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (EC) ప్రారంభించింది.

అంతేకాదు.. నగరంలో D2C ఫుట్‌ప్రింట్‌ను విస్తరించనున్నట్లు ఓలా ప్రకటించింది. విస్తరణలో భాగంగా ఓలా కంపెనీ.. హైటెక్ సిటీ, మాదాపూర్‌లో సెంటర్లను ప్రారంభించింది. నాగోల్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీతో పాటు మెహిదీపట్నంలోని రేతిబౌలి సిటీలో (EC)ల సంఖ్య 7కి చేరింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా.. దేశవ్యాప్తంగా ఒకే రోజు 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభించి రికార్డు క్రియేట్ చేసింది.

ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ (Anshul Khandelwal) మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆఫ్‌లైన్ మార్కెట్ మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. ఆఫ్‌లైన్ మార్కెట్ విస్తరించే వేగాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Ola Electric opens three more experience centres in Hyderabad

Ola experience centres in Hyderabad ( Photo : Google)

Read Also : Nord CE 3 Lite : రూ.19,999కే వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్.. నార్డ్ బడ్స్ 2 ధర రూ. 2,999 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

దేశంలోని మారుమూల మూలల్లో మిలియన్ల మంది భారతీయులకు తమ ప్రొడక్టులతో సర్వీసులను సజావుగా అందించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఓలా (Ola) ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు వినియోగదారులకు ఒకే ప్రదేశంలో వేగవంతమైన సర్వీసులను అందించనున్నట్టు అన్షుల్ పేర్కొన్నారు.

దాదాపు 90శాతం మంది ఓలా కస్టమర్లు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారని అన్నారు. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు కస్టమర్‌లకు S1, S1 Pro మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని అందిస్తాయని చెప్పారు. అలాగే, కొనుగోలు ప్రక్రియలో మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని తెలిపారు.

కస్టమర్‌లు స్టోర్‌లలో ఫైనాన్సింగ్ ఆప్షన్ల గురించి సమాచారాన్ని పొందవచ్చు. ఓలా యాప్ (Ola App) ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన మోడల్ కొనుగోలు చేయొచ్చు. 2025 నాటికి దేశంలో మొత్తం 2W ఎలక్ట్రిక్‌గా మార్చాలనే లక్ష్యంతో ఓలా ముందుకు దూసుకెళ్తోంది. స్టేబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ప్రపంచం దృష్టిని మార్చేందుకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Read Also : iQoo Neo 6 Price in India : భారీగా తగ్గిన ఐక్యూ నియో 6 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర పెరిగేలోగా ఇప్పుడే కొనేసుకోండి..!