New Government Policy
New Government Policy : ఓలా, ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా? అయితే, ఇకపై కొత్త ప్రభుత్వ పాలసీ అమల్లోకి వస్తోంది. ఇకపై క్యాబ్ డ్రైవర్లు బుకింగ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు డబ్బులు చెల్లించాల్సిందే..
Read Also : Google Pixel 9 : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ఫోన్ కావాలంటే ఇలా కొనేసుకోండి.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు!
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మేరకు మహా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
యాప్ ఆధారిత క్యాబ్ హెయిలింగ్ సేవలతో ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ కొత్త విధానాన్ని ఆమోదించింది. సాధారణంగా ఏదైనా రైడ్ బుక్ చేసుకున్నాకా ఆ రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లపై ఛార్జీలు పడేవి.
ఇకపై డ్రైవర్లు క్యాన్సిల్ చేసినా కూడా ఆ క్యాన్సిలేషన్ ఫీజు కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే కస్టమర్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.
కస్టమర్ల సమయాన్ని వృథా చేసినందుకుగానూ వారికి తగిన పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల వల్ల రైడర్లు రైడింగ్ క్యాన్సిల్ చేసేందుకు ఇష్టపడరు.
తద్వారా ప్రయాణికులకు మెరుగైనా సేవలను అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఓలా, ర్యాపిడో, ఉబెర్ వినియోగదారులు ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త విధానం ద్వారా రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అధిక సర్జ్ ధరలకు ప్రభుత్వం ముగింపు పలికింది. పీక్ అవర్స్, వాతావరణం లేదా డిమాండ్‌తో సంబంధం లేకుండా యాప్ ఆధారిత ఛార్జీలు ఇకపై రాష్ట్రం ఆమోదించిన బేస్ ఛార్జీ కన్నా 1.5 రెట్లు మించవు.
ప్రయాణీకులు చిన్న ప్రయాణాలకు రూ. 1,500 వంటి అధిక రేట్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. గతంలో అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో సాధారణంగా ఉండేది.
ఇప్పటివరకు, రద్దీ సమయాల్లో లేదా వర్షం సమయంలో ఛార్జీలు 5 రెట్లు పెరిగేవి. కొంతమంది ప్రయాణీకులు తక్కువ దూరాలకు రూ. 1,500 కన్నా ఎక్కువ చెల్లిస్తారని రాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్వర్ అన్నారు.
కొత్త విధానం ప్రకారం పగలు, రాత్రి రెండింటిలోనూ ప్రభుత్వం ఆమోదించిన బేస్ ఛార్జీ కన్నా 1.5 రెట్లు సర్జ్ ధరలపై పరిమితి ఉంటుంది. పలు కంపెనీలు యాప్ అల్గోరిథంలను కూడా అందుకు తదనుగుణంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
అదనంగా, రైడ్‌లపై అందించే డిస్కౌంట్‌లను ఇప్పుడు 25శాతానికి పరిమితం చేశారు. ప్రమోషనల్ ఆఫర్‌ల ద్వారా ప్లాట్‌ఫారమ్‌లు ధరలను మార్చకుండా నిరోధిస్తాయి.
Read Also : Greg Abel : వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం.. కంపెనీకి కొత్త సీఈఓ.. రూ.100 లక్షల కోట్లకి ‘వారసుడు’ ఇతనే..!
ఇప్పటివరకు, రద్దు చేసినందుకు రైడర్లు మాత్రమే జరిమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు, రైడ్ అంగీకరించిన తర్వాత రద్దు చేసే డ్రైవర్లకు కూడా జరిమానా చెల్లించాల్సి వస్తుందని భీమన్వర్ వ్యాఖ్యానించారు.