Greg Abel : వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం.. కంపెనీకి కొత్త సీఈఓ.. రూ.100 లక్షల కోట్లకి ‘వారసుడు’ ఇతనే..!
Greg Abel : గత 25 ఏళ్లుగా బెర్క్‌షైర్ హాత్వేలో భాగమైన 62 ఏళ్ల గ్రెగ్ అబెల్ ఇప్పుడు రూ. 100 లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈఓగా, వారెన్ బఫెట్‌కు వారసుడు కాబోతున్నారు.

Greg Abel : ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు, అమెరికన్ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
Read Also : Google Pixel 9 : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ఫోన్ కావాలంటే ఇలా కొనేసుకోండి.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు!
చాలా ఏళ్లుగా కంపెనీకి నాయకత్వం వహించిన 94 ఏళ్ల బఫెట్.. గ్రెగ్ అబెల్‌ను సీఈఓగా నియమించాలని బోర్డుకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఎప్పటినుంచో అబెల్ బఫెట్ వారసుడిగా ఎంపిక చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి.
ఇప్పుడు అధికారికంగా ప్రపంచంలోని అతిపెద్ద గ్రూపులలో ఒకటైన బఫెట్ కంపెనీకి అబెల్ నాయకత్వం వహించనున్నారు. ఈ కంపెనీ వాల్యూ 865 బిలియన్ డాలర్లు ఉంటుంది.
గ్రెగ్ అబెల్ ఎవరు? :
62 ఏళ్ల గ్రెగ్ అబెల్ రెండు దశాబ్దాలకు పైగా బెర్క్‌షైర్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు, బఫెట్ ఎంచుకున్న వారసుడిగా కంపెనీ బాధ్యతలను చేపట్టనున్నారు. అబెల్ కెనడాలోని ఆల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుంచే కష్టపడి పనిచేసేవారు.
చిన్నతనంలో బాటిళ్లు సేకరించడం, అగ్నిమాపక యంత్రాలను సర్వీసింగ్ చేయడం వంటి వివిధ కూలీ పనులు చేసేవారు. అబెల్ కష్టపడి పనిచేసే స్వభావం, అంకితభావం వంటి లక్షణాలే ఆయన్ను ఈ స్థాయికి ఎదిగేలా చేశాయి. 1984లో ఆల్బెర్టా యూనివర్శిటీ నుంచి ఆనర్స్ డిగ్రీని పొందారు.
అబెల్ తన కెరీర్‌ను ప్రైస్‌వాటర్ హౌస్‌కూపర్స్‌లో ప్రారంభించారు. ఆ తరువాత కాల్ఎనర్జీకి మారారు. అక్కడ ఆయన 1999లో ఫ్యూయల్ కంపెనీకి అధ్యక్షుడయ్యారు.
అదే ఏడాదిలో బెర్క్‌షైర్ హాత్వే కంపెనీలో నియంత్రణ వాటాను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆ కంపెనీకి బెర్క్‌షైర్ హాత్వే ఎనర్జీగా పేరు మార్చారు. కంపెనీ అభివృద్ధికి అబెల్ కీలక పాత్ర పోషించారు.
అబెల్ బెర్క్‌షైర్ హాత్వేలో యుటిలిటీలు, రైల్‌రోడ్స్ తయారీతో సహా వివిధ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. బీమాయేతర కార్యకలాపాల వైస్ ఛైర్మన్‌గా, BNSF రైల్వే డైరీ క్వీన్‌తో సహా పెద్ద అనుబంధ సంస్థలను నిర్వహిస్తారు. బెర్క్‌షైర్ హాత్వే ఎనర్జీ కూడా ఆయన నాయకత్వంలోనే అభివృద్ధి చెందింది.