Google Pixel 9 : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ఫోన్ కావాలంటే ఇలా కొనేసుకోండి.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు!
Google Pixel 9 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 10,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Google Pixel 9
Google Pixel 9 : మీరు ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గింది. గత ఆగస్టులో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌ను ఆవిష్కరించింది.
ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.70వేల లోపు ధరకే పిక్సెల్ 9 ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
రూ.10,500 కన్నా ఎక్కువ తగ్గింపును అందిస్తోంది. కెమెరా సెటప్, ఏఐ ఫీచర్లతో ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ధర తగ్గింపు :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ఫోన్ రూ.5వేల డిస్కౌంట్‌తో రూ.74,999కి అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ.5,750 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
పిక్సెల్ 9 ఫోన్ ధర రూ.69,249 వరకు తగ్గింది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ నెలకు రూ.6,250 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.43,150 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా పొందొచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వరకు అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా OISతో 48MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9లో 10.5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
Read Also : Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. తక్కువ ధరకే శాంసంగ్ మడతబెట్టే ఫోన్.. డోంట్ మిస్!
అదనంగా, ఈ గూగుల్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాదు.. గూగుల్ పిక్సెల్ 9 మ్యాజిక్ ఎడిటర్, సర్కిల్ టు సెర్చ్, ఇన్-బిల్ట్ జెమిని వంటి ఏఐ ఫీచర్లతో కూడా వస్తుంది. గూగుల్ హ్యాండ్‌సెట్‌లో 7 ఏళ్ల OS,సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.