OnePlus 12 Launch Timeline And Key Specifications tipped, here are the details
OnePlus 12 Launch Time Key Specifications tipped : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతోంది. వన్‌ప్లస్ 11 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీతో పాటు ఫీచర్ల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. 2023 ప్రారంభంలో OnePlus 11 ఫోన్ ప్రకటించగా.. నెక్స్ట్ జనరేషన్ డివైజ్ వన్‌ప్లస్ 12 వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
OnePlus 12 ఫ్లాగ్‌షిప్ చిప్‌ను కలిగి ఉంటుంది. ఎందుకంటే.. కంపెనీ అత్యంత ఖరీదైన ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ భారీ బ్యాటరీకి సపోర్టు చేస్తుంది. మెరుగైన జూమ్ సామర్ధ్యాలకు పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుందని లీక్ డేటా చెబుతోంది. లాంచ్‌కు ముందే OnePlus 12 కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి చూద్దా..
వన్‌ప్లస్ 12 కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ :
వన్‌ప్లస్ (OnePlus 12) ఫోన్ Qualcomm కొత్త Snapdragon 8 Gen 3 SoCతో రానుంది. ఈ ఫోన్ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కొత్త చిప్‌సెట్ సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ ఏడాది చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు కొత్త చిప్‌తో రావొచ్చు. వన్‌ప్లస్ 12 వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇందులో వెనుకవైపు రెండు 50MP కెమెరాలు, పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన 64MP సెన్సార్ ఉండవచ్చు. హుడ్ కింద, 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని చూడవచ్చు. కొత్త వన్‌ప్లస్ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుందని, అధిక QHD రిజల్యూషన్‌తో పనిచేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది.
OnePlus 12 Launch Time And Key Specifications tipped
వన్‌ప్లస్ 12 లాంచ్ ఎప్పుడంటే? :
ఈ ఏడాది డిసెంబర్‌లో వన్‌ప్లస్ 12 లాంచ్ అవుతుందని అంచనా. అయితే, ముందుగా చైనాలో వస్తుందని టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ పేర్కొన్నారు. గ్లోబల్ లాంచ్ ఈ ఏడాది ఉత్పత్తితో జరిగినట్లే వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఫిబ్రవరిలో OnePlus 11 ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ వన్‌ప్లస్ 12 మోడల్ రాబోతోంది. ఈ ఫ్లాగ్‌షిప్‌ను కొంచెం ముందుగానే ప్రారంభించాలని OnePlus నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి, ఈ ఫోన్ గురించి వివరాలు పెద్దగా రివీల్ కాలేదు.
వన్‌ప్లస్ 12 భారత్‌లో ధర ఎంత? :
వన్‌ప్లస్ 11 భారత మార్కెట్లో రూ. 56,999 ధర ట్యాగ్‌తో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఈ సెగ్మెంట్‌ను అందించనుంది. ఈ వన్‌ప్లస్ 12 ధర కూడా ఇదే పరిధిలో ఉంటుందని భావిస్తున్నారు. భారత్‌లో వన్‌ప్లస్ 12 లాంచ్ అయినప్పుడు రూ. 60వేల లోపు ధర ఉండొచ్చు. రాబోయే OnePlus ఫోన్ అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.