Suchir Balaji : ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి..!
Suchir Balaji : భారత సంతతికి చెందిన 26 ఏళ్ల బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించారు.

OpenAI whistleblower Suchir Balaji
Suchir Balaji : ప్రముఖ ఏఐ టెక్ దిగ్గజం చాట్‌జీపీటీ పేరంట్ కంపెనీ ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్ సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారత సంతతికి చెందిన 26 ఏళ్ల బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించారు. ఆయన మృతదేహం నవంబర్ 26న బుకానన్ స్ట్రీట్‌లోని తన ఫ్లాట్‌లో పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా ఏమీ తేలలేదని, ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయమై అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలాజీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆయన నవంబర్ 2020 నుంచి ఆగస్టు 2024 వరకు ఓపెన్ఏఐలో పనిచేశారు.
సుచిర్ బాలాజీ మరణాన్ని ఓపెన్ఏఐ ధృవీకరణ :
బాలాజీ మరణాన్ని ఆయన మాజీ కంపెనీ ఓపెన్ఏఐ ధృవీకరించింది. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. “బాలాజీ మరణవార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యాం. ఈ క్లిష్ట సమయంలో సుచిర్ కుటుంబ సభ్యులకు మా సానుభూతిని తెలియజేస్తున్నాం. బాలాజీ మరణాన్ని ప్రకటించిన పోస్ట్‌పై అమెరికన్ బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా ‘hum’ అని రాస్తూ స్పందించారు. మస్క్ 2015లో సామ్ ఆల్ట్‌మన్‌తో ఓపెన్‌ఏఐని ప్రారంభించారు.
ఏపెన్ఏఐ విధానాలపై తీవ్ర ఆరోపణలు :
ఓపెన్ ఏఐ నిర్వహించే ఆపరేషన్లు, విధానాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని గతంలో బాలాజీ ఆరోపించారు. ఓపెన్ ఏఐ పలు కాపీరైట్ఉల్లంఘనలకు పాల్పడుతోందని బహిరంగంగా ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన 3 నెలల తర్వాత బాలాజీ మృతిచెందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చాట్‌జీపీటీ ఓపెన్ ఏఐ ద్వారా అభివృద్ధి అయింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. 2022 చివరిలో యాప్‌ను లాంచ్ చేయగా రచయితల నుంచి అనేక చట్టపరమైన సవాళ్లకు ఎదుర్కొంది. ఆ సమయంలో, చాలా మంది రచయితలు, ప్రోగ్రామర్లు, జర్నలిస్టులు తమ యాప్‌లను అభివృద్ధి చేసేందుకు తమ కాపీరైట్ మెటీరియల్‌ను కంపెనీ చట్టవిరుద్ధంగా ఉపయోగించిందని ఆరోపించారు.
అక్టోబర్ 23న విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. శిక్షణ కోసం సమాచారాన్ని పొందేందుకు చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్న వ్యాపారాలు, వ్యాపారవేత్తలపై ఓపెన్ఏఐ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బాలాజీ ఆరోపించారు.
Read Also : Vivo Y300 5G Launch : వివో Y300 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!