Oppo A3 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో A3 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

Oppo A3 Pro Launch : ఒప్పో కొత్త ఫోన్ వచ్చేసింది.. ఆకర్షణీయమైన ఫీచర్లతో ఐపీ69 రేటింగ్, మీడియాటెక్ డైమన్షిటీ 7050 చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Oppo A3 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో A3 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

Oppo A3 Pro With MediaTek Dimensity 7050 Chipset, IP69 Rating Launched

Updated On : April 13, 2024 / 5:23 PM IST

Oppo A3 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి సరికొత్త ఎ2 ప్రోకి వారసుడిగా ఒప్పో ఎ3 ప్రో ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లేటెస్ట్ ఎ సిరీస్ హ్యాండ్‌సెట్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో అమర్చింది.

Read Also : Apple Warn iPhone Users : మెర్సిన‌రీ స్పైవేర్‌ అటాక్.. భారత్ సహా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక..!

గరిష్టంగా 12జీబీ ర్యామ్‌తో ఒప్పో ఎ3 ప్రో ఐపీ69 రేటింగ్‌తో వస్తుంది. 360-డిగ్రీల యాంటీ-ఫాల్ బాడీని కలిగి ఉందని పేర్కొంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 64ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

ఒప్పో ఎ3 ప్రో ధర, లభ్యత :
ఒప్పో ఎ3 ప్రో ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో బేస్ మోడల్ ధర రూ.1,999గా ఉంది. ఈ ఫోన్ 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంది. దీని ధర వరుసగా సీఎన్‌వై 2,199, సీఎన్‌వై 2,499కు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, (JD.com) ద్వారా ఏప్రిల్ 19 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అజూర్ (గ్లాస్ ఫినిషింగ్), క్లౌడ్ బ్రోకేడ్ పౌడర్ (లెదర్ ఫినిషింగ్), మౌంటైన్ బ్లూ (లెదర్ ఫినిషింగ్) కలర్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది.

ఒప్పో ఎ3 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ (నానో) ఒప్పో ఎ3 ప్రో ఆండ్రాయిడ్ 14పై ఒప్పో కలర్ఓఎస్ 14 స్కిన్‌తో రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2412×1080 పిక్సెల్‌లు) అమోల్డ్ కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 360-డిగ్రీల యాంటీ ఫాల్ బాడీని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఒప్పో ఎ3 ప్రో 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో మీడియా టెక్ నుంచి డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు ఎఫ్/1.7 ఎపర్చరుతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో పాటు ఎఫ్/2.4 ఎపర్చరు ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ఎఫ్/2.0 ఎపర్చర్‌తో ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా ఉంది. మీరు ఒప్పో ఎ3 ప్రోలో 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని పొందవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌కు సపోర్టు అందిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. అధిక ఉష్ణోగ్రత, నీటి నిరోధకతకు ఐపీ69 రేటింగ్‌ను కలిగి ఉంది.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!